వైద్యుల రోజిది . వైద్య వృత్తిని సన్మానించు కొనే దినం ఇది !
ప్రతి విలువైన దానికి ఒక రోజుని కేటాయించుకొని గౌరవ పురస్సరం గా జ్ఞాపకం చేసు కొంటాం . అలాగే వైద్యుల సేవా నిరతి కి గుర్తుగా , ఈ "డాక్టర్స్ డే ' జరుపుకొంటాం .
గత దశాబ్ద కాలం కాలం గా వైద్యులకు రోగులకు మధ్యన ఉండే విస్వాస పూరితమైన బంధం బలహీనమైతుంది . అంతేకాదు, ప్రభుత్వానికి,సమాజంలోని భిన్న వర్గాలకు , చివరికి మీడియాకి కూడా వైద్య రంగం పై "చిన్న చూపు" ఎక్కువైతుంది . నేటి పరిస్థితి ఎలా ఉందంటే, వైద్యులను క్రిమినల్స్ గా చిత్రీక రించడం మామూలై పోయింది . అటు ప్రభుత్వం కూడా భయంకరమైన చట్టాలతో, వైద్య రంగాన్ని వీడిపోయే టట్లుగా వైద్యులను భయ భ్రఅంతులను చేస్తుంది . రోగం ఒక చోటవుంటే మందు వేరొక చోట వేస్తుంది ప్రభుత్వం .
అయినా , ఈ విషయాలను ఇక్కడ చెప్పుకోవడం సందర్భోచితం కాకపోయినా, చెప్పక తప్పడం లేదు .
పరిస్థితి అలాంటిది .
ఆంధ్రప్రదేశ్ మె డికల్ రక్షణ చట్టం 11 /2008 అనేది ప్రయివేట్ మరియు ప్రభుత్వ రంగంలోని డాక్టర్స్ మరియు ఇతర హాస్పిటల్ సిబ్బంది రక్షణ కోసం ఏర్పరచిన చట్టం . ఈ చట్టం గురించి చాలామందికి తెలిసినా , క్రింది స్థాయి పోలీస్ వ్యవస్థ దీనిని ఉపయోగించడం లేదు . అవగాహనా రాహిత్యం మరియు మీడియా మరియు రాజకీయ శక్తుల ప్రోద్భలం వలన కొన్ని సార్లు కనీసం కేసులు కూడా నమోదు కావడం లేదు . కాబట్టి, వైద్యుల రక్షణకోసం ఉద్దేశింపబడిన ఈ చట్టాన్ని ఉపయోగించి, హాస్పిటల్స్ పై దాడిచేసే అరాచక శక్తులను అదుపు చేయవలసిన బాధ్యత పోలీసువారిపై ఉంది .
వైద్య సేవని ,వినియోగపరమైన సేవగా ఎందుకు పరిగణిస్తున్నారు ?
నిజానికి నేటి ఆధునిక వైద్య రంగం సంధికాలంలో ఉంది . సమాజంలో, వైద్యం పై లెక్కలేనన్ని అపోహలు అపార్ధాలు ఉన్నాయి . దీనికి తోడు పుంఖాను పుంఖాలుగా పత్రికలలో, టి . వి. లలో వచ్ఛే
ఆరోగ్య సలహా ప్రోగ్రామ్ లు ప్రేక్షకులలో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి .
సూక్ష్మంగా పరిశీలిస్తే , ఎప్పుడైతే ప్రయివేట్ రంగంలో కార్పోరేట్ హాస్పిటల్స్ వచ్చ్చాయో ,అప్పటి నుండి
ఈ విధమైన అపోహలు పెరిగాయి . పెరిగిపోతున్నాయి .
న్యాయంగా ఆలోచిస్తే, కార్పోరేట్ హాస్పిటల్స్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకు రావాలి . ఎందుకంటే అవి కంపెనీలు . కానీ చిన్న హాస్పిటల్స్ ని కూడా కార్పోరేట్ హాస్పిటల్స్ కోవలో నే జమవేసి గంపగుత్తగా చట్టాలు చేస్తుంది ప్రభుత్వం . దీనివలన చిన్న,మధ్యస్థాయి హాస్పిటల్స్ క్రమేణా కనుమరుగై పోయే దుస్థితి వస్తుంది . అపుడు మనందరం కార్పోరేట్ హాస్పిటల్స్ పైనే ఆధారపడవలసిన అగత్యం ఏర్పడుతుంది . వైద్య సేవ, కార్పొరేటైజేషన్ అయితే , వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండదు . అంతేకాదు,ఇన్సూరెన్స్ కంపెనీల, కార్పరేట్ హాస్పిటల్స్ గుప్పిట్లోకి వైద్యం వెళ్లిపోతుంది .
కార్పోరేట్ హాస్పిటల్స్ పనిచేసే విధానానికి, మామూలు ప్రయివేట్ హాస్పిటల్స్ పనిచేసే తీరుకి చాలా తేడా లుంటాయి . అది మీకందరికీ తెలుసు!
వైద్య సేవ అనేది ఇతర సేవల వలె ఒక నిర్దుష్ట సాంకేతికత ప్రకారం జరిగిపోయే మెకానికల్ వ్యవస్థ కాదు . చికిత్స విజయవంతం అవ్వడం అనేది, కేవలము ఒక డాక్టర్ చేతిలోనో, ఒక హాస్పిటల్ చేతిలోనో ఉండదు. ఎన్నో కారణాలు ఉంటాయి . వీటికి తోడు రోగం యెక్క దశ, రోగి యొక్క తత్త్వం,మందుల నాణ్యత ఇవన్నీ కూడా చికిత్స యెక్క ప్రభావ శీలత ను ప్రభావితం చేస్తాయి .
అలాగే, మెడికల్ నిర్లక్ష్యానికి,మెడికల్ ఎర్రర్ కి తేడా చాలా సున్నితం గా ఉంటుంది . అది కనిపెట్టాలంటే ఒక నిర్దుష్ట మైన నైపుణ్యత గల మెడికల్ బోర్డు కి మాత్రమే సాధ్యం . అందుకే , ఏదైనా దురదృష్ట సంఘటన జరిగినపుడు, డాక్టర్స్ పై మెడికల్ నిర్లక్ష్యపు కేసులు బనాయించడం మంచిదికాదని సుప్రీం కోర్టు చెప్పింది .
మెడికల్ బోర్డు రిపోర్ట్ తీసుకొన్న తర్వాత మాత్రమే కేసు పైల్ చేయాలని సుప్రీం కోర్టు సూచించింది .
నకిలీ వైద్యులను అరికట్టలేని పోలీస్ మరియు వైద్య అధికార వ్యవస్థ .
ఎన్నో చట్టాలున్నా,సుప్రీం కోర్టు,మరెన్నో హైకోర్టులు చెప్పినా నకిలీ వైద్యులను మాత్రం అదుపు చేయలేక పోతున్నారు . కానీ 10 ఏళ్ళు చదివిన వైద్యుడు హాస్పిటల్ పెట్టి సేవలు అందించాలంటే పదుల కొద్దీ చట్టాలు, వందలాది నిబంధనల తో ఉక్కిరి బిక్కిరి చేయడం ఎంతవరకు సబబు?
వైద్య వృత్తి అనేది ఒక నోబుల్ వృత్తి . ఈ వృత్తిని నిర్వర్తించే వైద్యులను నియంతరించడానికి మెడికల్ కౌన్సిల్ అనే అటానమస్ సంస్థ ఉంది . అయినా కూడా , భిన్న చట్టాలతో , వైద్యులకు సంకెళ్లు వేయడానికి ఉవ్విళూరు తున్న ప్రభుత్వం కేవలం మనదేశంలోనే ఉంది . అంతేకాదు, ఆయుష్ వైద్యులతో ఆధునిక వైద్యం చేయించడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయంటే, మనదేశంలో ఆధునిక వైద్య వృత్తి ఎంత దయనీయ స్థితిలో
ఉందో తెలుస్తుంది .
నిర్బంధ వైద్య సర్వీసులను ఇవ్వాలని PG చేసిన డాక్టర్స్ కి నిబంధన పెట్టారు . దీనికి కారణం,వీరిని రూరల్ ఏరియాలలో వినియోగించు కోవాలనే ఉద్దేశ్యం. మంచి ఉద్దేశ్యమే! కానీ, వీరందరిని జిల్లా మరియు మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ లోనే వినియోగించు కొంటున్నారు తప్ప,రూరల్ ఏరియాలలో వీరికి పోస్టింగ్ లు ఇవ్వడం లేదు . కనీసం వీరికి ఇచ్ఛే కాస్తపాటి జీతం కూడా నెల నెలా ఇవ్వడం లేదు .
ఇలా చెప్పికొంటూ పోతే వైద్యుల గోస సాగుతానే ఉంటుంది .
న్యాయాన్ని,చట్టాన్ని కాపాడే మీ లాంటి అనుభవజ్ఞులు , పెద్దలతో , మా ఆవేదనను పంచు కొంటున్నాం .
అంతరించిపోయే దశలో ఉన్న ఆధునిక వైద్య వృత్తిని రక్షించడంలో మీ వంతు సాయం అందిస్తారని ఆశిస్తున్నాం ....

Comments
Post a Comment