Skip to main content

The mystery behind generics- జనరిక్ మాయాజాలం

అయ్యా ఈ  మందులు చూసివ్వండయ్యా ... కొనలేక చస్తున్నాం "అంటూ ఒకతను  లింగయ్య మందుల షాపుకి
వచ్చ్చాడు . అందులో పెద్ద అక్షరాలతో నీట్ గా మందుల పేర్లు వ్రాసివున్నాయ్ . చూడగానే లింగయ్య  ముఖం చింకి చాటంత  అయింది .మందులిఛ్చి అతన్ని పంపేసి, నా  వైపుతిరిగి , అందులో వ్రాసినవన్నీ జనరిక్ మందులే, వీటిపై సుమారు 1000శాతం మార్జిన్ ఉంటుందని నవ్వుతూ చెప్పాడు  .
మరి ప్రధానమంత్రి గారేమిటి , జనరిక్ మందులు చాలా చౌకగా ఉంటాయని,వాటినే వ్రాసేటట్లుగా డాక్టర్స్ పై వత్తిడి పెడతామని చెప్పారు?
నిజమే! అవి మన మందుల షాపులకి చౌకగానే వస్తాయి .మందులు తయారు చేసే కంపెనీలు
 రూపాయి మందుని మనకి రెండురూపాయలకు అమ్ముతారు . మనం వాటిని 20 రూపాయలకి రోగులకు అమ్మేస్తాం.
అదే బ్రాండెడ్ మందులైతే ,కంపెనీలు రూపాయి మందుని  మనలాంటి షాపులకి 25రూపాయలకి అమ్ముతారు. మనమేమో, 7 రూపాయలు (30%) లాభం వేసుకొని రోగులకు అమ్ముతాం .
అరె ,  జనరిక్ మందుల అమ్మకాల్లో ఇన్ని  లాభాలు ఉన్నాయా?
మరి? జనరికా ? మజాకా ?
నీకేం బోధపడిందో ఇప్పుడు చెప్పు...
దీనికి పెద్ద బుర్ర కావాలేంటి ? బ్రాండెడ్ మందులపై లాభాలు కంపెనీలకి,జనరిక్ మందుల అమ్మకాలపై లాభాలు రిటైల్ మందుల షాపోళ్ళకి  దక్కుతాయి .
మరి ప్రధానమంత్రిగారేంటి, డాక్టర్స్ ని కోప్పడుతున్నారు ?
ఆ... వాళ్ళైతే నోరుమెదపరు,కాలుకదపరు . అద్దాల గదుల్లో బిర్ర బిగుసు కొని కూర్చుంటారు తప్ప ,కనీసం వాళ్ళ అస్సోసి యేషన్ చెప్పేది కూడా లెక్కచేయరు . వాళ్ళవలన ప్రమాదం ఏమీ లేదు కాబట్టే ప్రతిఒక్కరు వాళ్లనే టార్గెట్ చేస్తున్నారు .
సరే,మనకెందుకులే ఆ గోల. రోజుకి 10 జనరిక్ మందుల చీట్లు వస్తే చాలు .... అమరావతిలో ఎకరం పొలం కొనేయడానికి ఇంకెంతో దూరం లేదు....

ప్రభుత్వానికి ఒక్క సలహా :
జనరిక్ మందులు అత్యంత చౌక  ధరకు అందివ్వాలనే చిత్తశుద్ధి నిజంగా ఉంటే ,  
జనరిక్ మందుల పై  చౌక ధరను  ముద్రించి,అదే ధరకు ఆ మందులను, మందుల షాపు వాళ్ళు అమ్మేటట్లు కట్టడి చేయవలసిన బాధ్యత  ప్రభుత్వానిదే! 
రిటైల్ షాపులపై నియంత్రణ :  జనరిక్ మందుల   వలన లాభం పొందేది షాపుల వాళ్ళే కాబట్టి, వారిపై నియంత్రణా చర్యలు పాటించ క పోతే డాక్టర్స్ జనరిక్ మందులు వ్రాసినా ఆ లాభం రోగులకు అందదు !
Quality Assurance:
అలాగే, జనరిక్ మందుల నాణ్యతపై ఉన్న సందేహాలను పటా పంచలు చేయాలంటే ఇప్పటిలా కేవలం 0. 5%కాకుండా కనీసం 50% జనరిక్ మందుల ను క్వాలిటీ పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే మార్కెట్ లోకి విడుదల చేసే చట్టం ఉండాలి. 
బ్రాన్దేడ్/ జనరిక్ ... మందు ఏదైనా, డాక్టర్స్ కి కావలసింది అవి పనిచేయడం , రోగుల కు మేలు జరగడం! ....


Comments