Skip to main content

వైద్య రంగంలో ని కొన్ని సమస్యలు - పరిష్కారాలు :

1.  వెయ్యిమంది జనాభాకి ఒక్క మోడ్రన్ డాక్టర్ ఉండాలని WHO  సూచిస్తే , మనదేశంలో ప్రస్తుతం 1600 మంది జనాభాకి ఒక్క మోడ్రన్ డాక్టర్  ఉన్నారు . కానీ ఆయుష్ వైద్యుల సేవలను కూడా పరిగణ నలోకి తీసుకొంటే WHO  సూచన  కంటే ఎక్కువ వైద్యులు ఉన్నట్లే !ఎందుకంటే గ్రామీణ భారతీయ జనాభా ఎక్కువగా ,మొత్తం మీద 40% భారతీయులు, ప్రాధమిక మరియు సెకండరీ వైద్య సేవల కోసం ,  ఆయుష్ వైద్యాన్నే కోరుకొంటున్నారు . 
సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో(CHC) ,జిల్లా హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ ల కొరత
 (80%DEFICIT )  తీవ్రం గా ఉంది . 
కాబట్టి క్లినికల్ PG సీట్లను బాగా పెంచాలి .
 ప్రస్తుత మున్న 15000  క్లినికల్ PG  సీట్లను 30000 కి పెంచాలి . 

2. ఇండియన్ మెడికల్ రిజిష్టర్  రియల్ టైం  లో పనిచేసే టట్లు చూడాలి . మరణించిన వారిని , ప్రాక్తీ సు ,సర్వీస్ మానేసిన వారి పేర్లను ఆక్టివ్ రిజిస్టర్ నుండి తొలగించాలి . 

3.   కరిక్యులం లో థియరీ కంటే ప్రాక్టికల్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇఛ్చి, సిమ్యులేషన్ లాబ్ లు , వర్త్యు వల్ (virtual ) సౌకర్యాలతో  ట్రైనింగ్ ఇఛ్చి,  మౌలిక సదుపాయాలు కొరత ఉండే గ్రామీణ ప్రాంతాలలో కూడా అత్యవసర వైద్యం, అందించ గల MBBS వైద్యులను తయారు చేయాలి .
  అంతే గానీ , ఆయుష్ వైద్యులకు,నర్సులకు  6నెలలు తర్ఫీదునిఛ్చి ఆధునిక వైద్యపు మందులను సూచించే వారిగా తయారు చేయడం  ఎవ్వరికీ మంచిది కాదు . 
పైగా అది IMC-1956  చట్టాన్ని ఉల్లంఘించి నట్లే అవుతుంది . 

4. జాతీయ ఎక్జిట్ పరీక్ష కి బదులుగా , ఫైనల్ ఇయర్  పరీక్షలను  ఆలిండియా స్థాయిలో ఒకే విధమైన ప్రశ్న వళి ,ఒకే విధమైన వైవా ,ప్రాక్టికల్స్ (ప్రస్తుతం DNB పరీక్షల నియమావళిని అనుసరిస్తే మంచిది ) అనగా OSCI' పద్ధతిలో నిర్వహించాలి . 

5. పెద్ద ఆపరేషన్ లు చేసిన తర్వాత కూడా కేవలం 3రోజుల మెడికల్ కేర్ సరిపో తున్న నేటి ఆధునిక సాంకేతిక పరిస్థితులలో ఎక్కువ బెడ్స్ ఉండవలసిన ఆవశ్యకత , అవసరం లేదు . 
నేటికాలం పు  "డేకేర్"  వైద్యానికి  తగుమాత్రపు మెడికల్ సాంకేతిక పరికరాలతో కూడిన చిన్న చిన్న హాస్పిటల్స్ కూడా సరిపోతాయి . 
కాబట్టి హాస్పిటల్స్ పెద్దవా ,చిన్నవా అనేది నిర్ణయించడానికి బెడ్స్ సంఖ్యను ప్రామాణికం గా 
తీసుకో కూడదు . 
అవసరమైన పరికరాలు , వైద్య  సౌకర్యాలు ,మానవ వనరులు అందించగల హాస్పిటల్స్ ని కూడా ఎంపానెల్ మెంట్  చేసుకొని , ముఖ్యంగా  ఆరోగ్యబీమా కి సంబంధించిన ప్రాధమిక మరియు సెకండరీ  వైద్య సేవలకు అనుమతిస్తే గ్రామీణ రోగులకు అందుబాటులోనే కాష్ లెస్ గా వైద్యం అందించ వచ్చుఁ . అంతే కాదు, కార్పొరేట్ హాస్పిటల్స్ పై అనూహ్యమైన వత్తిడిని తగ్గించి
 టెరి షి యరి (Tertiary care)వైద్యసేవలను ఇంకా సమర్ధం గా అందించ వచ్చుఁ . 

6.  వైరల్ జ్వరాలు, గాయాలు , ప్రమాదాలు , పాముకాటు , స్ట్రోక్ , మొదలైన అత్యవసర వైద్య సేవలకు అవసరమైన  ప్రాధమిక వైద్య  సేవలు అందించే మౌలిక సదుపాయాలు , నర్సులు ,డాక్టర్స్  మనదేశానికి నేడు అత్యంత అవసరం . ప్రతి గ్రామము లో లేదా, కనీసం 3కిలోమీటర్ల దూరం మించ కుండా ఇలాంటి సేవలు పౌరులకు ఉచితం గా లభ్యమయ్యే సౌకర్యాలు ఉండాలి . 

7 . అంకితభావం , మేధస్సు  ( aptitude & attitude) ఉన్నవారికి వైద్య విద్య అందుబాటులో ఉండాలి . 
జాతీయ ప్రవేశ పరీక్ష (NEET) అనేది మంచి నిర్ణయం . అంతే కాదు దేశ అవసరాలకు ముఖ్యం గా జనారోగ్యానికి(Public health) అవసరమైన వైద్యసేవలను అందుబాటులో అందివ్వగల నైపుణ్యాన్ని  అందించే మెడికల్ కరిక్యులం ఉండాలి .  

Comments