Skip to main content

ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టము -2016 సవరణ బిల్లు ---- "రండి .... వ్యతిరేకిద్దాం " .

ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టానికి  2016 సంవత్సరం లో సవరణ బిల్లుని ప్రతిపాదించారు . కానీ ఇంకా పార్లమెంట్ ఆమోదం పొందలేదు .
ఈ బిల్లులో పొందుపరచిన అంశాలు : .
10E అనే క్లాజు ని పెట్టారు . అందులో ఉన్న విషయం :
MBBS వారు ,వారి వారి యూనివర్సిటీ పరీక్షలు పాసై,  డిగ్రీ పట్టా తీసుకొన్న తర్వాత మెడికల్ కౌన్సిల్ లో
రిజిష్టర్  చేయించుకొని ఉద్యోగమో, ప్రాక్టీసో చేయాలంటే జాతీయ ఎక్జిట్ పరీక్ష లో ఉత్తీర్ణు లవ్వాలి . అంతే కాదు , ఈ ఎగ్జిట్ పరీక్షే  NEET-PG EXAM  లా  కూడా పనిచేస్తుంది . అంటే వేరే NEET-PG  పరీక్ష ఉండదు . అలాగే విదేశాలైన చైనా ,ఫిలిప్పీన్స్ , రష్యా లాంటి దేశాలలో MBBS పాసైన వారికి నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష ఇక ఉండదు . ఎగ్జిట్ పరీక్షే  స్క్రీనింగ్ పరీక్ష కానుంది .
అనగా , స్క్రీనింగ్ పరీక్ష, NEET-PG  పరీక్ష అనేవి వేరే ఉండవు . జాతీయ స్థాయిలో వైద్య విద్య  ప్రమాణాలను పెంచే ఎగ్జిట్ పరీక్షే ఉంటుంది . అంటే ఇదొకరకం గా 3in1పరీక్ష !
(కానీ మనము (IMA)  ఈ ఎగ్జిట్ పరీక్షను వ్యతిరేకిస్తున్నాం . ఎందుకంటే విశ్వవిద్యాలయ  స్థాయి పరీక్ష పాసైన తర్వాత మళ్ళీ ఇంకో పరీక్షలో పాసవ్వ వలసిన అవసరం ఏముంది ? 
విద్యార్థులకు అనవసరమైన వేదన , సమయం వృధా తప్ప) . 

MBBS & PG ప్రవేశాలకు జాతీయ స్థాయి కౌన్సిలింగ్ ఉంటుంది .
ప్రిన్సిపల్ చట్టంIMC-1956  లోని సెక్షన్ 13-4 లో మొదటి పేరా తర్వాత ఇంకో పేరాని ప్రవేశ పెట్టారు .
" ప్రభుత్వం నోటిఫై / గుర్తించిన విదేశీ మెడికల్ కాలేజీ లలో మెడికల్ MBBS/PG  చదివి, ఆయా దేశాలలో ప్రాక్తీ సు చేసుకోవడానికి అనుమతి ఉన్న వారు , మరే స్క్రీనింగ్ పరీక్షలు, ఎగ్జిట్ పరీక్ష  లేకుండా భారతదేశం లో సర్వీసు / ప్రాక్టీ సు చేసుకో వచ్చుఁ" . 

ప్రిన్సిపల్ చట్టంIMC-1956  లోని సెక్షన్ 14 - 1 కి సవరణ :
" చారిటీ సేవలకు , బోధనకు , పరిశోధనలకు మాత్రమే" అనే వాక్యాన్ని తీసివేశారు .
ప్రిన్సిపల్ చట్టంIMC-1956  లోని సెక్షన్ 15లోని  క్లాజు 1 లో షెడ్యూల్ అనే పదం తర్వాత ---
"  జాతీయ ఎక్జిట్ పరీక్షలో కనీస మార్కులను సాధించాలి " . అనే వాక్యాన్ని చేర్చారు .
అలాగే , ప్రిన్సిపల్ చట్టంIMC-1956  లో 20 బి సెక్షన్ అనే దానిని పెట్టారు ---- 
" ఏజన్సీ మరియు గ్రామీణ ప్రాంతాలలో 3ఏళ్ళు ప్రభుత్వ సర్వీసు చేసినవారికి NEXT(ఎగ్జిట్ )  పరీక్ష ద్వారా 
 అన్ని రకాల PG  సీట్లలో 50% రిజర్వేషన్" ఇవ్వాలి . అంతేకాదు , వీరు PG విద్య పూర్తి చేసిన
తర్వాత మరో 3ఏళ్ళు ప్రభుత్వ సర్వీసు చేయాలి" . 

ప్రిన్సిపల్ చట్టంIMC-1956  లోని సెక్షన్ 33 లో రెండు కొత్త క్లాజులు పెట్టారు . 
mc clause:     "MBBS  వారికి జాతీయ ఎక్జిట్ పరీక్ష నిర్వహించాలి "
md clause :    MBBS&PG  ప్రవేశాలకు  జాతీయ స్థాయిలో కామన్ కౌన్సిలింగ్   చేయాలి "

ఈ ఎగ్జిట్ పరీక్షను వ్యతిరేకిస్తూ , సుమారు 3లక్షల మెడికో లు , IMA ఆధ్వర్యం లో   ఫిబ్రవరి 1 వ తారీఖున దేశవ్యాప్త ఆందోళన చేయడానికి సిద్ధం గా ఉన్నారు . 
ఆ రోజున ఎక్కడ మెడికల్ కాలేజీ ఉంటే అక్కడ , IMA సభ్యులు ,మెడికోలు --- సమస్త ప్రజానీకానికి ,మీడియా వారికి, ఆరోగ్య శాఖాధికారులకు ,MLA % MP లకు , అర్ధమయ్యే రీతిలో ఆందోళనలు, ధర్నాలు , మెమోరాండం సమర్పణ లు నిర్వహించాలి .
 మెడికల్ విద్యారంగం , వైద్య రంగమే కాదు.... ఇది  ప్రతి పౌరుని సమస్య  !

Comments