ఇది అంతం కాదు ... ఆరంభం !
జాతీయ బాంక్ ల పరిస్థితి ఘోరం గా ఉంది . ఎంత ప్రయత్నీమ్చినా , 6లక్షల కోట్ల మొండి బాకీలు వసూల్ కావడం లేదు . అత్యవసరం గా ఆ బాంక్ లకు డబ్బు కావాలి . కనీసం లక్ష కోట్లు కావాలి .
సరే ,ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసు కొందాం . నల్ల ధనం ఎలా తయారైతుంది ?
మన ఆర్ధిక వ్యవస్థలో 4 రకాల ధనం చలామణీ లో ఉంటుంది .
అనగా , సుమారు 80% నల్ల ధనం ఈ విధం గా విలువైన వస్తు రూపంలో గానీ , భూమి రూపం లో గానీ ,విలాస వస్తువుల రూపం లోగానీ ఉంది . దీనివలన ఆర్ధిక వ్యవస్థ కి అంతగా భంగం కలగదు .
నల్లధనం లో కేవలం 20%, కరెన్సీ రూపం లో ఉండి , నకిలీ కరెన్సీ తో కలిసి , అవినీతికి ,లంచాలకు , ఎలక్షన్ ల సమయంలో ఓట్లు కొనుబడికి ,దొంగరవాణాకి , మత్తుమందు సరఫరాలకు , ఉగ్రవాదుల సాయానికి దుర్వినియోగ మైతుంది . దీ నిని నిరోధించడానికే మోడీ పెద్దనోట్ల రద్దు కార్యక్రమం చేపట్టారు .
నల్లధనం ఆర్ధిక వ్యవస్థలోకి ఎలా వస్తుంది ?
మొదటి ముద్దాయి లు , అవినీతితో పుచ్చ్చి పోయిన ప్రభుత్వ అధికారులు, అక్రమాలు చేయడానికి లంచాలివ్వడానికి ఉరుకు లెత్తే ప్రజలు .
ప్రజలు పన్ను లు కట్టకుండా మతలబు చేయడం వలన , అలాగే ,ప్రభుత్వపథకాలకు కేటాయించిన బడ్జెట్ పక్కదారిపట్టడం వలన వెరసి అవినీతి మయ అధికారులవలనే నల్లడబ్బు వ్యవస్థలో పెరిగిపోతుంది . దీనివలన
ద్రవ్యోల్పణం,ఆర్ధిక అసమానతలు పేట్రేగి పోవడం వలన యువత ఉగ్రవాదం, ప్రత్యేక వాదం, నక్సలిజం మొదలైన వ్యవస్థ తిరుగుబాటు చర్యలకు లోబడి పోతున్నారు .
మనిషిలో అవినీతి అనేది హృదయంలో ఉన్నంతవరకు ఎన్ని చట్టాలు పెట్టినా తాత్కాలికమైన ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం రాదు .
వ్యవస్థలో సుమారు 86 శాతం ఉన్న పెద్ద నోట్లు , మరో 4శాతం ఉన్న నకిలీ పెద్దనోట్ల వలన ఆర్ధిక వ్యవస్థ అదుపు తప్పుతున్న ఈ దశలో , సాహసించి పెద్ద నోట్లను రద్దు చేయడ మనేది తప్పని సరి చర్య !
ఇంకా మంచి మార్గమేదన్నా ఉంటే ఆర్ధిక వేత్తలు ప్రభుత్వానికి సూచించ వచ్చుఁ .
సమస్త సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు అటు నల్ల ధనము ,ఇటు నకిలీ కరెన్సీ కొమ్ము కాస్తున్నాయి .
ఉగ్రవాదులను ఏరి వేయడానికి సైన్యాన్ని ఉపయోగించి ఎలా ఎదుర్కొంటున్నామో , అంతే ప్రభావ శీలం గా
ఈ పెద్దనోట్ల రద్దు వలన ఉగ్రవాద .మత్తుమందు రవాణా ,మనుషుల రవాణా ,హవాలా మూలాలను ఛేదించడం
జరుగుతుంది .
అవును , ఈ రద్దు చర్య వలన , కొత్త నోట్ల ముద్రణకు, వాటి రవాణాకు , ATM ల కాలిబ్రేషన్ కు, ప్రభుత్వానికి సుమారు 7000 కోట్లు ఖర్చు అవుతుంది . అంతే కాదు , 50కోట్ల భారతీయుల సమయం, శ్రమ ఒక నెల రోజుల పాటు వృధా అవుతుంది . ప్రభుత్వ జాతీయ ఉత్పత్తి , దేశ జాతీయ ఉత్పత్తి కూడా ఒక నెల రోజులు వెనుక బడుతుంది . సమయం వృధా అవ్వడం అనేది జరుగుతుంది తప్ప సంపద నాశనం అవ్వదు . పైపెచ్చు , రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయి .
ఉదాహరణకు , 12 నెలల్లో ఒక లక్ష రూపాయలు ఉత్పత్తి అయ్యేది , 13 నెలలు పడుతుంది .
మన దేశ సంపద ఉత్పత్తి ఏటా సుమారు 100 లక్షల కోట్లు .
సైన్యానికి ,అమ్యునిషన్ కి , మొదలైన ఉగ్రవాద నిరోధ చర్యలకు ఏటా ఖర్చు పెట్టే సుమారు 30000 కోట్ల రూపాయల ఖర్చుతో పోల్చు కొంటె , ఈ ఖర్చు పెద్ద లెక్కలోది కాదు .
ఇంకొక్క విషయం . దేశ వార్షిక సంపద ఉత్పత్తిలో 7 శాతం అనగా 7లక్షల కోట్లు కరెన్సీ మాత్రమే వ్యవస్థలో చెలామణీ లో ఉండాలి తప్ప ,ఇప్పటి లాగ 20 శాతం ఉండకూడదు .
సు మారు లక్షకోట్ల (విలువ కాదు )కరెన్సీ నోట్లు చెలామణీ లోఉన్నాయి . ఇందులో 1000 నోట్ల శాతం కేవలం 7%(7000కోట్ల కాగితాలు) ; 500/- నోట్ల శాతం 16% ( 16000 కోట్ల కాగితాలు ) .
ఇప్పుడు ప్రభుత్వం చేయవలసింది ...
1. అత్యంత వేగం గా 100,50, 200/- విలువ గల నోట్లను ముదిరించి పంపిణీ చేయాలి .
2. చిన్న చిన్న వ్యాపారస్తులకు , కిరాణా షాపులకు , రోడ్ సైడ్ వెండర్స్ కి "కార్డు స్వైప్ మెషిన్" ( e-point of sale ) లను లక్షలాదిగా ఉచితం గా పంచాలి .
3. అలాగే , రూపే కార్డు లను యాక్టివేట్ చేయాలి .
4. అధికారుల్లో అవినీతిని అరికట్టే చర్యలు యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలి .
5 . ఇన్ని రకాల పన్నులు తీసేసి , ఒకే ఒకరకం పన్ను - " బాంక్ లావాదేవీ పన్ను " ను మాత్రమే వేయాలి . అంతే కాదు , లావాదేవీ లన్నీ నగదు రూపంలో కాకుండా బాంక్ ల ద్వారా మాత్రమే జరిగే టట్లు చేయాలి .
వరద లోచ్చ్చినపుడు , ఉప్పెనలు వఛ్చిన ప్పుడు , ఎన్నో కష్టనష్టాలు సంభవిస్తాయి .
అవినీతితో ,నల్లధనం తో అప్రతిహతం గా చిన్న భిన్న మైతున్న సమాజం లో మేలిమలుపు రావాలంటే
ఇలాంటి కుదుపు అవసరమే !
ఇప్పటికే ఎన్నో లాభాలను మనం చూస్తున్నాం .
ఆశ్చర్య భూతమైన విషయం గా ఈ నోట్ల రద్దుని చేయకపోతే ఎన్నో నల్ల తిమింగలాలు తప్పించు కొంటాయనే ఉద్దేశ్యం తో ఇలా ఒక్కసారిగా రద్దు చేసారు తప్ప , ఇంకా ఎన్నో జాగ్రత్తలు తీసుకో లేక మాత్రం కాదు .
మనం సహకరిస్తే నే ఇది విజయ వంత మైతుంది .

- న్యాయసమ్మతమైన సంపాదన .
- పన్నులు కట్టని న్యాయ సమ్మతమైన సంపాదన .
- అన్యాయ పూరితమైన , చట్ట సమ్మతం కానీ సంపాదన .
- నకిలీ కరెన్సీ .
- ఎగుమతులు -దిగుమతులు చేసే ట్రేడర్స్ సరైన బిల్లులు చూపించ కుండా కూడ బెట్టిన డబ్బుతో . విదేశాలలో ఒక డమ్మీ సంస్థను స్థాపించి , ఆ సంస్థ ద్వారా , మన దేశ స్టాక్ మార్కెట్ లో షేర్లు కొని , ఆ డబ్బుని వైట్ మనీ గా మార్చు కొంటారు . విదేశీ పెట్టు బళ్లలో సింహ భాగం ఈ బాపతే ! ఇది సుమారు 150 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వ అంచనా .
అనగా , సుమారు 80% నల్ల ధనం ఈ విధం గా విలువైన వస్తు రూపంలో గానీ , భూమి రూపం లో గానీ ,విలాస వస్తువుల రూపం లోగానీ ఉంది . దీనివలన ఆర్ధిక వ్యవస్థ కి అంతగా భంగం కలగదు .
నల్లధనం లో కేవలం 20%, కరెన్సీ రూపం లో ఉండి , నకిలీ కరెన్సీ తో కలిసి , అవినీతికి ,లంచాలకు , ఎలక్షన్ ల సమయంలో ఓట్లు కొనుబడికి ,దొంగరవాణాకి , మత్తుమందు సరఫరాలకు , ఉగ్రవాదుల సాయానికి దుర్వినియోగ మైతుంది . దీ నిని నిరోధించడానికే మోడీ పెద్దనోట్ల రద్దు కార్యక్రమం చేపట్టారు .
నల్లధనం ఆర్ధిక వ్యవస్థలోకి ఎలా వస్తుంది ?
మొదటి ముద్దాయి లు , అవినీతితో పుచ్చ్చి పోయిన ప్రభుత్వ అధికారులు, అక్రమాలు చేయడానికి లంచాలివ్వడానికి ఉరుకు లెత్తే ప్రజలు .
ప్రజలు పన్ను లు కట్టకుండా మతలబు చేయడం వలన , అలాగే ,ప్రభుత్వపథకాలకు కేటాయించిన బడ్జెట్ పక్కదారిపట్టడం వలన వెరసి అవినీతి మయ అధికారులవలనే నల్లడబ్బు వ్యవస్థలో పెరిగిపోతుంది . దీనివలన
ద్రవ్యోల్పణం,ఆర్ధిక అసమానతలు పేట్రేగి పోవడం వలన యువత ఉగ్రవాదం, ప్రత్యేక వాదం, నక్సలిజం మొదలైన వ్యవస్థ తిరుగుబాటు చర్యలకు లోబడి పోతున్నారు .
మనిషిలో అవినీతి అనేది హృదయంలో ఉన్నంతవరకు ఎన్ని చట్టాలు పెట్టినా తాత్కాలికమైన ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం రాదు .
వ్యవస్థలో సుమారు 86 శాతం ఉన్న పెద్ద నోట్లు , మరో 4శాతం ఉన్న నకిలీ పెద్దనోట్ల వలన ఆర్ధిక వ్యవస్థ అదుపు తప్పుతున్న ఈ దశలో , సాహసించి పెద్ద నోట్లను రద్దు చేయడ మనేది తప్పని సరి చర్య !
ఇంకా మంచి మార్గమేదన్నా ఉంటే ఆర్ధిక వేత్తలు ప్రభుత్వానికి సూచించ వచ్చుఁ .
సమస్త సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు అటు నల్ల ధనము ,ఇటు నకిలీ కరెన్సీ కొమ్ము కాస్తున్నాయి .
ఉగ్రవాదులను ఏరి వేయడానికి సైన్యాన్ని ఉపయోగించి ఎలా ఎదుర్కొంటున్నామో , అంతే ప్రభావ శీలం గా
ఈ పెద్దనోట్ల రద్దు వలన ఉగ్రవాద .మత్తుమందు రవాణా ,మనుషుల రవాణా ,హవాలా మూలాలను ఛేదించడం
జరుగుతుంది .
అవును , ఈ రద్దు చర్య వలన , కొత్త నోట్ల ముద్రణకు, వాటి రవాణాకు , ATM ల కాలిబ్రేషన్ కు, ప్రభుత్వానికి సుమారు 7000 కోట్లు ఖర్చు అవుతుంది . అంతే కాదు , 50కోట్ల భారతీయుల సమయం, శ్రమ ఒక నెల రోజుల పాటు వృధా అవుతుంది . ప్రభుత్వ జాతీయ ఉత్పత్తి , దేశ జాతీయ ఉత్పత్తి కూడా ఒక నెల రోజులు వెనుక బడుతుంది . సమయం వృధా అవ్వడం అనేది జరుగుతుంది తప్ప సంపద నాశనం అవ్వదు . పైపెచ్చు , రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయి .
ఉదాహరణకు , 12 నెలల్లో ఒక లక్ష రూపాయలు ఉత్పత్తి అయ్యేది , 13 నెలలు పడుతుంది .
మన దేశ సంపద ఉత్పత్తి ఏటా సుమారు 100 లక్షల కోట్లు .
సైన్యానికి ,అమ్యునిషన్ కి , మొదలైన ఉగ్రవాద నిరోధ చర్యలకు ఏటా ఖర్చు పెట్టే సుమారు 30000 కోట్ల రూపాయల ఖర్చుతో పోల్చు కొంటె , ఈ ఖర్చు పెద్ద లెక్కలోది కాదు .
ఇంకొక్క విషయం . దేశ వార్షిక సంపద ఉత్పత్తిలో 7 శాతం అనగా 7లక్షల కోట్లు కరెన్సీ మాత్రమే వ్యవస్థలో చెలామణీ లో ఉండాలి తప్ప ,ఇప్పటి లాగ 20 శాతం ఉండకూడదు .
సు మారు లక్షకోట్ల (విలువ కాదు )కరెన్సీ నోట్లు చెలామణీ లోఉన్నాయి . ఇందులో 1000 నోట్ల శాతం కేవలం 7%(7000కోట్ల కాగితాలు) ; 500/- నోట్ల శాతం 16% ( 16000 కోట్ల కాగితాలు ) .
ఇప్పుడు ప్రభుత్వం చేయవలసింది ...
1. అత్యంత వేగం గా 100,50, 200/- విలువ గల నోట్లను ముదిరించి పంపిణీ చేయాలి .
2. చిన్న చిన్న వ్యాపారస్తులకు , కిరాణా షాపులకు , రోడ్ సైడ్ వెండర్స్ కి "కార్డు స్వైప్ మెషిన్" ( e-point of sale ) లను లక్షలాదిగా ఉచితం గా పంచాలి .
3. అలాగే , రూపే కార్డు లను యాక్టివేట్ చేయాలి .
4. అధికారుల్లో అవినీతిని అరికట్టే చర్యలు యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలి .
5 . ఇన్ని రకాల పన్నులు తీసేసి , ఒకే ఒకరకం పన్ను - " బాంక్ లావాదేవీ పన్ను " ను మాత్రమే వేయాలి . అంతే కాదు , లావాదేవీ లన్నీ నగదు రూపంలో కాకుండా బాంక్ ల ద్వారా మాత్రమే జరిగే టట్లు చేయాలి .
వరద లోచ్చ్చినపుడు , ఉప్పెనలు వఛ్చిన ప్పుడు , ఎన్నో కష్టనష్టాలు సంభవిస్తాయి .
అవినీతితో ,నల్లధనం తో అప్రతిహతం గా చిన్న భిన్న మైతున్న సమాజం లో మేలిమలుపు రావాలంటే
ఇలాంటి కుదుపు అవసరమే !
ఇప్పటికే ఎన్నో లాభాలను మనం చూస్తున్నాం .
- ప్రభుత్వాలకి కట్టవలసిన పన్నుబకాయిలన్నీ వసూల్ అయ్యాయి .
- ఉగ్రవాదులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు .
- నల్లధనానికి అడ్డాగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం లో కరెక్షన్ వచ్చ్చేసింది .
- అన్నింటి కంటే ముఖ్యం గా , బాంక్ డిపాజిట్ లు పర్వతం లా పెరిగిపోతున్నాయి .
- నకిలీ కరెన్సీ ప్రభావం 90% అణగి పోయింది .
- బంగారు నగల వర్తకులు పుంజాలు తెంపు కొంటూ బంగారం నిల్వల సమాచారాన్ని ఏరోజు కా రోజు ఇవ్వడంతో నల్ల డబ్బుని బంగారం గా మార్చుకోవడం కష్టమై పోయింది .
- వ్యాపారవేత్తలు తమదగ్గర పేరుకు పోయిన నల్ల ధనాన్ని ఈ సంవత్సరపు సంపాదనగా చూపిస్తూ, అడ్వాన్స్ పన్ను కట్టి మరీ డిపాజిట్ చేస్తున్నారు .
- డిజిటల్ చెల్లింపులనేవి(Mobile phone based IMPS) నెమ్మదిగా పుంజుకొంటున్నాయి .
ఆశ్చర్య భూతమైన విషయం గా ఈ నోట్ల రద్దుని చేయకపోతే ఎన్నో నల్ల తిమింగలాలు తప్పించు కొంటాయనే ఉద్దేశ్యం తో ఇలా ఒక్కసారిగా రద్దు చేసారు తప్ప , ఇంకా ఎన్నో జాగ్రత్తలు తీసుకో లేక మాత్రం కాదు .
మనం సహకరిస్తే నే ఇది విజయ వంత మైతుంది .
Comments
Post a Comment