Skip to main content

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ - హ స్పిటల్ బోర్డు -ఆంద్ర ప్రదేశ్ వారి విన్నపం .

                                                                                           
        ఇండియన్  మెడికల్ అసోసియేషన్ - హ స్పిటల్ బోర్డు -ఆంద్ర ప్రదేశ్  వారి విన్నపం . 

To
The Director of Health services
New delhi .

Namaste.

 మెడికల్ కౌన్సిల్ ని (MCI) , జాతీయ మెడికల్ పరీక్షల బోర్డు (NBE)ని రద్దు చేసి , నాలుగు బోర్డు కమిటీ  లతో కలగలిపిన  జాతీయ వైద్య కమిషన్  మరియు  జాతీయ వైద్య సలహా సంఘ స్థాపనకు ఉద్దేశించిన "జాతీయ మెడికల్ కమిషన్ ముసాయిదా బిల్లు-2016" పై , మా తీవ్ర అభ్యంతరాన్ని ఈ క్రింది విధం గా తెలియ చేస్తున్నాం . అలాగే , ఈ డ్రాఫ్ట్ బిల్లు ని చదివిన ఎంతో మంది వైద్యుల మనోభావాలను , వారు వెలి
బుచ్చ్చిన భయాలు ,సందేహాలను    వివరం గా విన్నవించు కొంటున్నాము . 
దయచేసి పరిశీలించి తగు  నిర్ణయం తీసు కోవలసిందిగా ప్రార్ధన !
అయ్యా ,
మీ  సంస్థ అంతర్జాల సైట్ లో   “Draft National Medical Commission Bill 2016 (NMC Bill 2016)” ని  బహిరంగం గా ప్రకటించి , దానిపై అభ్యంతరాలను ఆహ్వానించిన మీకు, ముందుగా
కృతజ్ఞతలు . 
ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే , ఈ బిల్లు ప్రజాస్వామ్య విలువలను , వైద్య వృత్తి ప్రమాణాలను దిగజార్చే దే గానీ మీ బిల్లు ప్రవేశిక (preamble) లో చెప్పు కొన్నట్లు  ఇది వైద్య ప్రమాణాలను పెంచే మంచి ఆలోచన కాదు . 
మీ బిల్లు  లోని అంశాలను చదివిన తర్వాత,ఆరోగ్య సేవారంగంలో  అతిపెద్ద భాగస్వాముల మైన మా వైద్యులకే
కాదు ,  ప్రజాస్వామ్య దేశ పౌరులకు అందరికీ కొన్ని అనుమానాలు ,మరి కొన్ని భయాలు ,సందేహాలు కలుగుతాయి . చట్టం అంటే వ్యవస్థ నియంత్రణకు పునాది వంటిది . దానిని ఆధారం చేసుకొని నియమాలు ,నిబంధనలు తయారు చేస్తారు . చట్టం లోని విషయాలే అవినీతికి, బంధు ప్రీతికి, స్వజన ప్రీతికి కొమ్ము కాసే విధం గా ఉంటే , మరి నియమ నిబంధనలు ఎంత  అప్రజాస్వామికం గా ఉంటాయో చెప్పనక్కర లేదు .
  వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలు , వైద్య వృత్తిలో అత్యున్నత విలువల సాధన మనందరి గమ్యం.  
గౌరవనీయమైన వృత్తులలో వైద్య వృత్తి  ఒక్కటి . దానిని కూడా నియంత్రిమ్చ వలసిందే . అందులో ఎలాంటి సందేహం లేదు . కానీ ఎవరు ,ఏ విధం గా , ఎలాంటి వ్యవస్థతో నియంత్రిమ్చాలి ?   అనేది చర్చించ వలసిన అంశం . 
2.5 లక్షల మంది తో కూడిన  ఆధునిక  వైద్యుల సంఘము, ఆరోగ్య రంగం లో అత్యంత పెద్ద  భాగస్వామ్య సంస్థ  ఐన IMA  సూచనలకు విలువ ఇవ్వకుండా , వైద్యరంగం లో పూర్తి  లోతైన అవగాహన లేని వారితో  సంప్రదించుకొని , ఎవరో ఎదో పరిశీలించి రిపోర్ట్ లు తయారు చేసుకొని మీకు సమర్పిస్తే , మీరు ఇలాంటి  నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు . 
అవినీతి రహిత స్వయం నియంత్రణా వ్యవస్థ (uncorrupted autonomous regulator)అనేది  ప్రతి వృత్తికి  అవసరం .  అవినీతి తో మురిగి పోయిన  స్వయం నియంత్రణా వ్యవస్థ అనేది మనదేశం లో కేవలం  MCI లో  తప్ప , మీకు ఎక్కడా కనబడలేదా ?  సరే , MCI ఒక్కటే అనుకొందాం . ప్రజాస్వామ్య విలువలతో కూడిన విధానాలతో దానిని బాగుచేయడానికి  ప్రయత్నిమ్చాలి తప్ప , అప్రజాస్వామ్య విధానాలతో కూడిన మరో వ్యవస్థను తెచ్చ్చు  కోవడం గోటితో చేసే పని గొడ్డలితో చేయడమే !
1.  1956 నుండి ఉన్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టాన్ని సవరించు కొని సరి చేసుకొంటే పోయేదానికి మరో కొత్త చట్టం తెఛ్చి గందరగోళం చేయడం ,రాజకీయ రంగులు పులుము కోవడం తప్ప మీరు కొత్తగా ప్రతిపాదించిన బిల్లు సాధించిందేమీ లేదు . 
2. ఆరోగ్య రంగాన్ని బాగు చేయాలంటే అన్నింటి కంటే ముందు చేయవలసింది , ఎలాంటి అర్హత లేకుండా నకిలీ వైద్య ము చేస్తూ ప్రజారోగ్యాన్ని భ్రష్ట్టు పట్టిస్తూ ,ప్రభుత్వ ఆరోగ్య పధకాలను నీరు గారుస్తున్న నకిలీ వైద్యులను ముందుగా  ఏరి వేయాలి . 
3.  వైద్య విద్యలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టి ,    ఎలాంటి సౌకర్యాలు లేని పల్లెలలో కూడా మంచి వైద్యం అందించ గల సత్తా ఉండే డాక్టర్ లను తయారు చేయ కుండా , అప్రజాస్వామిక   చట్టాలతో (జాతీయ వైద్య కమిషన్ ) ఇంకా ఎంతకాలం ప్రజలను తప్పుదారి పట్టిస్తారు ? 
4. చార్ట్ ర్డు అకౌంటంట్స్ (ICAI)కి  ,కాస్ట్ &వర్క్స్ అకౌంటంట్స్ (ICWAI)కి , అద్వకేట్స్(BCI)  కి ,కంపెనీ కార్యదర్సుల(ICSI)కి , ఆర్కిటెక్ట్ ల (COA)కి ఉన్న నియంత్రణా సంఘాలను వదిలేసి కేవలం మెడికల్ కౌన్సిల్ ని మాత్రమే రద్దు చేసి , రాజకీయపార్టీల కనుసన్నలలో పనిచేసే జాతీయ వైద్య కమిషన్ ని తేవాలను కోవడం ఎంతవరకు సబబో ప్రధానమంత్రి ,ఆరోగ్యశాఖ మంత్రులు ఒక్కసారి నిజాయితీగా ఆలోచించాలి . 
5. ఏటా సుమారు 25000 కోట్లు చేతులు మారే మెడికల్ కాలేజీ ల మరియు మెడికల్ సీట్ల అమ్మకాల నియంత్రణను ఎన్నికల ద్వారా కాకుండా నామినేట్ సభ్యులతో ( not elected but only selected members)  ఉండే జాతీయ వైద్య కమిషన్ ద్వారా   తమ గుప్పిట్లోనే ఉంచుకోవాలని రాజకీయ పక్షాలు , IAS లాబీలు ఉవ్విళూరు తున్నాయి  అని కొందరి సందేహం !
6.  50000 MBBS  సీట్లు , 25000  PG సీట్లు , NEET పరీక్ష  , మెడికల్  లైసెన్స్ పరీక్ష , PG ప్రవేశ పరీక్ష , వైద్యవిద్యల సిలబస్ , మెడికల్ కాలేజీల నియంత్రణ  మొదలైన వాటిపై కేవలం ఇద్దరి వ్యక్తులకి , అదీ ఎలాంటి వైద్య విద్యా పరిజ్ఞానం లేని రాజకీయ పార్టీల అనుంగు సహచరుల కనుసన్నలలో ఉంచాలను కోవడం ఎంత అప్రదిష్ట  ? ఆ చట్టానికి  మీరు ఏ పేరైనా పేట్టుకొండి ... అది మాత్రం  మాకొద్దు !
7. మేము  చదివింది ,చదువు కుంటుందీ అధునాతన వైద్య శాస్త్రం . దీనికి అల్లోపతి అని  ఏదో   పేరు పెట్టి చికాకు పెట్టకండి . ఇది ప్రత్యక్ష ప్రామాణిక వైద్య శాస్త్రం . అంతే గానీ దేశీయ వైద్యాన్ని (indian medicine) ప్రోత్స హించాలనే నెపం తో  ఆధునిక మెడికల్ వైద్య వృత్తిని(modern medical profession) నాశనం చేయ వద్దు .
8. వైద్య విద్యని , వైద్య వృత్తిని నియంత్రించాలనే నెపం తో  ఇప్పటికే ఎన్నో చట్టాలతో  డాక్టర్స్  కి  , వైద్య వృత్తికి శిలువలు (CE act,PNDT Act, CPA&many other draconian regulations)వేసీసారు . వ్యవస్థ అవినీతితో కుళ్ళి పోయిందనే నెపం తో MCI ని రద్దు చేయడానికి నడుం బిగించారు . 
మరి ,మనదేశం లో అవినీతి ,నల్ల ధనం తో కుళ్ళి కంపు గొడుతున్న వ్యవస్థలను కూడా మూసేస్తారా ? 
అలాగైతే , నేరాలు ఘోరాలు చేసే వారే చట్టాలు చేయడం ఎంతవరకు న్యాయం ? రాజకీయ నాయకులతో ,అదీ సగం మంది నేర చరిత్ర ఉన్న వారితో చట్ట సభలు నిండి పోయి  కంపు కొడుతుంటే పార్లమెంటు ని కూడా రద్దు చేయాలిగా సార్ ? 
9. ఏ సంస్థలో అయినా ప్రజాస్వామ్య విలువలు నిలవాలంటే , ఆ సంస్థ లోని సభ్యుల ను ఎన్నికల ద్వారా  ఎంచు కొంటే మంచిదా ? సెలెక్ట్ చేసుకొంటే మంచిదా ? అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న నాయకులకు , అధికారులకు ఈ లాజిక్ తెల్వదా ?
10. నియంత్రిప బడే వారే (వైద్యులు & ఈ దేశ పౌరులు ) ,తమను  నియంత్రిమ్చే వా రిని( మెడికల్ కౌన్సిల్ సభ్యులు & MP&MLA లు , మంత్రులు ) ఎన్నుకోవడంకరెక్ట్ అని  ఇన్నాళ్లు గా  మనందరం అనుకొంటున్నాం గదా ? మరెందుకు ఇంకో రకం గా ఆలోచన చేస్తున్నారు ? సరే మీ ఆలోచనే మంచిదని అనుకొందాం . అలాగైతే ముందుగా పార్లమెంట్ వ్యవస్థనే రద్దు చేయాలిగదా ?
11. ఇప్పటి వరకు MCI  ని పలురకాలుగా బెదిరించో ,అదిలించో తమ పబ్బం గడుపుకొని వందలాది ప్రయివేట్ వైద్య కాలేజీలను స్థాపించు కొని వేలకోట్ల నల్లధనం తో తమ సంచులను నింపుకొని ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తూ ,MCI  ని భ్రష్ట్టు పట్టించిన రాజకీయ కార్పొరేట్ సంస్థలు  , తమ ఆటలు ఇంకా సులువుగా ,నిరాఘాతం గా సాగించు కోవాలని MCI  ని రద్దుచేసి తమ కను సన్నలలో మెలిగే వ్యవస్థని తీసుకొచ్చే  పన్నాగం పన్నుతున్నారని అనుకోవాలా ?  ఇది   కొందరి అనుమానం . 
12. ఇప్పటికే వైద్యం కార్పోరేట్ వ్యవస్థల అధీనం లోకి వెళ్లి పోయింది . ముందు ముందు ఆరోగ్య భీమా కంపెనీల చేతిలోకి  కూడా వెళ్లి పోతుంది . ఇప్పటికే మన సమాజ వ్యవస్థలన్నీ అవినీతి , నల్ల ధనం , నేర చరిత్రలతో కుళ్లిపోయి ఉన్నాయి .  సమూల ప్రక్షాళన చేయకుండా మళ్ళీ  పొరపాటు  చేయొద్దని మా విన్నపం . 
13. వైద్యమనేది మనుషుల ప్రాణాలతో కూడి ఉన్న వృత్తి . ఈ వృత్తిలో వైద్యులతో పాటు ,నర్సులు, పారామెడిక్ లు , లాబ్ నిపుణులు , అన్నింటి కంటే ముందు ,మందులు,వైద్య పరికరాలు   తయారు చేసే కంపెనీలు అన్నీ శు ద్ధంగా  ఉన్నప్పుడే ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది . 
నకిలీ వైద్యులు, నకిలీ మందులను ఏరి వేయడానికి మీరేమి చేయ బోతున్నారు ? వీటి గురించి మీ ముసాయిదా బిల్లులో ఒక్క మాటలేదు . 
14. వైద్య కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల గురించి మీరెందుకు సరైన దిశలో ఆలోచించరు ?ఇంతకు  మునుపే MCI వారు ముసాయిదా రూపంలో బహిరంగ పరచిన "వైద్య విద్య సంస్కరణ లను" మీరెందుకు పక్కన పెట్టారు ? వైద్య విద్యార్థుల బోధనలో సరికొత్త సాంకేతికతను మీరెందుకు  ప్రవేశ పెట్టరు ?
ఇవన్నీ నెరవేరా లంటే మీ ముసాయిదా బిల్లు వలన సాధ్య పడదు . ఎందుకంటే , MCI వారు సూచించిన సంస్కరణలను ఆమోదించని మీరు , మళ్ళీ కొత్తగా ఇద్దరు కూర్చోని తయారు చేసే సలహాలను పాటిస్తారని  నమ్మకం ఏమిటి ?
15. వైద్య వృత్తిలో ప్రమాణాలు ,విలువలు పెంచే ఇప్పటి మెడికల్  కౌన్సిల్  చట్టాన్ని (IMC Act-1956) కొద్దిపాటి మార్పులతో ప్రభావంతం గ మలచు కో వచ్చుఁ . 
16. మెడికల్ కాలేజీల నియంత్రణ ,  మెడికల్ కాలేజీ అధ్యాపకుల నాణ్యతా ప్రమాణాలు , వైద్య విద్య లో నేటికాలానికి అనుగుణం మైన సాంకేతికత  మొదలైన వైద్య విద్య  కి సంబంధించి అత్యున్నత ప్రమాణాలకు  , వేరే నియంత్రణా  సంస్థని అదీ భాగస్వామ్య సంస్థల సలహా సంప్రదింపులతో ఏర్పాటు   చేస్తే మంచిది . 
17. కార్పోరేట్ వైద్య సేవలు , చిన్న హాస్పిటల్స్ , ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ,ప్రవేట్ వైద్య కళాశాలలు ,  మెడికల్ పరిశోధనలు , మందుల మరియు మెడికల్ పరికరాల తయారీ , నర్సింగ్ , వ్యాధి నిర్ధారణ సాంకేతికత ,  ఆరోగ్య సేవా రంగం ఇలా పలు విధాలుగా విడిపోయి వృద్ధి చెందుతున్న నేటికాలానికి అనుగుణ్యమైన చట్టాలు  తేవాలి తప్ప , ఇలా ఒకే రంగాన్ని టార్గెట్ చేయడం ,గందరగోళానికి , అనుమానాలకు ,అవినీతికి తావిఛ్చి నట్లు అవుతుంది .
18. ప్రయివేట్ వైద్య వృత్తి లో  అత్యున్నత విలువలు ,ప్రమాణాల నియంత్రణ  కోసం ఇప్పటి IMC-1956 చట్టం ,ఇప్పటికే ఉన్న పలు చట్టాలు ( CP act,PCPNDT act, CE act ,etc...) మరియు MCI
 సరిపోతాయి . 

అదీకాక , దేశంలో 80 శాతం ప్రజానీకానికి , 70 శాతం ఆరోగ్య అవసరాలు తీరుస్తున్న చిన్న చిన్న హాస్పిటల్స్  ని  CP act,PCPNDT act, CE act ,etc  నుండి తప్పించి , కేవలం MCI పరిధిలో ఉంచితే సరిపోతుంది. ఇదే మా   ముఖ్యమైన సలహా . ఎందుకంటే ఎలాంటి అర్హత లేని వారు నిరభ్యంతరం గా , ఎలాంటి చట్ట భయము లేకుండా ప్రాక్టీసు  చేస్తూ ఉంటే , అన్ని అర్హతలు ఉన్న వైద్యులు 
అలవికాని చట్టా లకు లోబడి , ఇన్స్పెక్టర్ లకు,రాజకీయ నాయకులకు ,గూండాలకు  భయపడు తూ  వైద్యం చేయవలసి రావడం ఎంత శోచ నీయమో ఒక్కసారి ఆలోచించండి . 
  
అయ్యా , 
జాతీయ వైద్య కమిషన్  మరియు జాతీయ ఆరోగ్య కౌన్సిల్ అనేవి వైద్య పరిజ్ఞానమున్న ,వైద్య విద్య పై అవగాహన ఉన్న వారి నుండి  ప్రజాస్వామ్య బద్ధ మైన విధానం లో ఎన్నికైన సభ్యులతో ఉంటే మంచిది . 

MCI సభ్యులను,  ప్రతి రాష్ట్రము ,కేంద్రపాలిత ప్రాంతం నుండి ఈ కింది విధం గా  ఎన్నుకోవాల ని మా సూచన::
  • రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకొన్న ప్రతి 5000 మంది డాక్టర్స్ నుండి  20 సంవత్సరాల  వైద్య  అనుభవం ఉన్న  ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి . (will look after problems faced by doctors and see to upgrade their skills and monitor ethical regulations in medical practise).
  • రాష్ట్రం లోని మెడికల్ కాలేజీ అధ్యాపకుల నుండి  15 ఏళ్ళు  వైద్య విద్య లో   అనుభవం ఉన్న ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి . (will monitor and contribute to paper presentations, journal publications and medical research work in colleges).
  • రాష్ట్రం లోని మెడికల్    విశ్వ విద్యాలయ పాలకవర్గం నుండి  10 ఏళ్ళు  వైద్య విద్య పాలనా   అనుభవం ఉన్న ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి . (will look after syllabus and curriculum,training modules  and exam conduction).
  • రాష్ట్రంలోని వైద్య కళాశాల ల నుండి   వైద్యము మరియు వైద్య విద్యా రంగం లో 10 ఏళ్ళు   అనుభవం ఉన్న ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి .( monitor the standards and grading  of medical colleges). 
  • రాష్ట్రం లోని  చిన్న హాస్పిటల్స్ యజమానుల నుండి కనీసం 20 సంవత్సరాల  వైద్య  అనుభవం,హాస్పిటల్ నడిపిన అనుభవం  ఉన్న  ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి . (monitor and see the welfare of the small hospitals and make them to adhere to various acts&regulations).
  • రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ వ్యక్తి ఒకరు ఉండాలి . (for general administration coordination between center and the state).
ఈ విధం గా  రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల  నుండి ఎన్నికైన సుమారు 200 మంది సభ్యులతో ఒక స్వయం నియంత్రణా వ్యవస్థ  ఉండాలి . దీనికి ఏ పేరైనా పెట్టండి !
ఈ కౌన్సిల్ సభ్యుల నుండి వివిధ ఉప సంస్థలను (sub-committees) ఏర్పాటు చేసి ఆరోగ్య సేవా రంగం లోని పలుశాఖలను  నియంత్రిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు !

 సహృదయం తో అర్ధం చేసు కొంటారని ఆశిస్తూ 
డా . శ్రీనివాస రాజు 
చైర్మన్ - HBI-IMA AP state.
9490172569. csrajuent10@gmail.com

Comments