Skip to main content

No mandatory govt service after MBBS&BDS in Telengana.

ఏడాదిపాటు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్య సేవలను అందించాలన్న నిబంధన నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు తెలంగాణా ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ శనివారం(30-4-2016) ఉత్తర్వులను జారీ చేశారు.

ఏపీ మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ రిజిస్ర్టేషన యాక్ట్‌-1968ను సవరిస్తూ 2013లో అప్పటి ప్రభుత్వం మెడికోలు తప్పనిసరిగా ఏడాదిపాటు ప్రభుత్వ వైద్య సేవలను అందించాలని నిబంధన విధించింది. దీని ప్రకారం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వంటి బ్యాచిలర్‌ కోర్సులు, పీజీ కోర్సులు, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులు ఎప్పుడైనా ఏడాదిపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్పనిసరి వైద్య సేవలందించాల్సి ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ జూనియర్‌ డాక్టర్ల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసింది. కనీసం ఎంబీబీఎ్‌స/బీడీఎస్‌ విద్యార్థులకైనా నిబంధనను సడలించాలన్న సంఘం విజ్ఞప్తిని పరిశీలించిన వైద్య విద్య డైరెక్టర్‌.. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల విద్యార్థులకు మాత్రమే నిబంధన వర్తిస్తుంది.

Comments