Skip to main content

NEET-2016 update exclusively for telugu states:

జాతీయ స్థాయిలో 15 శాతం సీట్ల కోటా తెలుగు రాషా్ట్రలకు వర్తించదు. అంటే రెండు తెలుగు రాషా్ట్రల మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోని 15 శాతం సీట్లు నేషనల్‌ పూల్‌లోకి చేరవు. ఫలితంగా వీరు దేశంలోని ఇతర రాషా్ట్రల్లోని మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ పొందేందుకు అవకాశం ఉండదు.

సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి దేశవ్యాప్తంగా ఈనెల ఒకటిన నిర్వహించిన మొదటి దశ నీట్‌కు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా హాజరైన విషయం తెలిసిందే. అయితే, నీట్‌ నిబంధనల కారణంగా ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పొందడానికి ఆ పరీక్ష రాసిన తెలుగు విద్యార్థులంతా అనర్హులు అవుతారు.

నీట్‌ నిబంధన 9.4లో పొందుపరచిన అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

Comments

Post a Comment