Skip to main content

విదేశాలలో వైద్య విద్య - కొన్ని జాగ్రత్తలు :

రష్యా లో మెడికల్ విద్య:
  • విద్యార్థులకు స్కాలర్ షిప్ సదుపాయాలు కూడా ఉన్నాయి. 
  • రష్యా మెడికల్ కళాశాలలు అన్నింటిలోనూ ఇంగ్లిష్ బోధన లేదు. కేవలం కొన్నింటిలోనే అందుబాటులో ఉంది. అదీ మొదటి మూడు సంవత్సరాల వరకే ఇంగ్లిష్ బోధన. నాలుగో ఏడాది నుంచి రష్యన్ భాషలోనే టీచింగ్ కొనసాగుతుంది. 
  • చదువుతూనే ఉద్యోగం చేసుకోవచ్చు. 
  • నెలవారీ జీవన వ్యయం సుమారు 100 అమెరికన్ డాలర్లుగా ఉంటుంది.
  •  యూనివర్సిటీలే విద్యార్థులకు మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తాయి. 
  • తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది.
  • రష్యా యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ తదితర కోర్సుల్లో ఎలాంటి ప్రవేశ పరీక్షలు రాయకుండానే నేరుగా అడ్మిషన్ పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారిలో అన్ని అర్హత ప్రమాణాలున్న వారికి ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన సీట్లు లభిస్తాయి. 
  • జనవరి నుంచి జూలై వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. తరగతులు సెప్టెంబర్ నుంచి మొదలవుతాయి. కచ్చితంగా సీటు కోరుకునేవారు ముందుగా దరఖాస్తు చేసుకోవడం మంచిదని నిపుణుల సూచన. 
  • ఇంటర్ లో కనీసం 50 శాతం మార్కులు ఉంటేనే ప్రవేశానికి అర్హత. 
  • కొన్ని  కళాశాలలు హాస్టల్ వసతి కల్పిస్తాయి కానీ, ఆహారాన్ని అందించవు. విద్యార్థులే సొంతంగా వండుకోవాల్సి ఉంటుంది.రష్యాలో చాలా కళాశాలల్లో వసతి సదుపాయం లేదు. విడిగా నివాసం, ఆహార వసతులను విద్యార్థులే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది.
  • భారత్ లో ఎంబీబీఎస్ తదితర బేసిక్ వైద్య విద్య చదివి పీజి వైద్య విద్యను రష్యాలో చేయాలనుకునే వారు ముందుగా అక్కడి విద్యా శాఖను సంప్రదించాలి. తమ దేశంలో విద్యార్హత, రష్యాలో విద్యార్హతతో సమానమంటూ తెలిపే సర్టిఫికెషన్ ఆఫ్ ఈక్వలెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
  • రష్యాలో ఎంబీబీఎస్ చదివేందుకు అయ్యే వ్యయం యూనివర్సిటీని బట్టి మారుతుంది. అది సుమారు ఏడాదికి Rs.3 నుండి 4లక్షలు .  హాస్టల్ ఫీజు ఏడాదికి సుమారు 50000/- .  భోజనం ఖర్చు అదనం. 

చైనా లో మెడికల్ విద్య :


  • భారత్ తో పోలిస్తే చైనాలోని విద్యా సంస్థలు వైద్య విద్యను తక్కువ ఫీజులకే అందిస్తున్నాయి. చైనాలో ఒక సెమిస్టర్ కు ఫీజు సుమారు వెయ్యి డాలర్లలోపే ఉంది. 
  • వైద్య విద్యా సంస్థల్లో పెకింగ్ యూనియన్ మెడికల్ కళాశాల, థర్డ్ మిలటరీ మెడికల్ యూనివర్సిటీ, సెకండ్ మిలటరీ మెడికల్ యూనివర్సిటీ, ద ఫోర్త్ మిలటరీ మెడికల్ యూనివర్సిటీ, కేపిటల్ మెడికల్ యూనివర్సిటీ, సౌతర్న్ మెడికల్ యూనివర్సిటీ, బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ చైనీస్ మెడిసిన్, తియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ, చైనా ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ, హార్బిన్ మెడికల్ యూనివర్సిటీలు మొదటి పది స్థానాల్లో ఉన్నాయి. 
  • చైనా  లో  మెడిసిన్ చదివే విద్యార్థుల కు  ఎక్స్ 1 వీసా ఇస్తారు .  ఎక్స్ 1 వీసాను గరిష్ఠంగా ఐదేళ్ల కాల వ్యవధి కోసం ఇస్తారు. ఈ వీసాతో చైనా వెళ్లిన వారు నెలలోగా పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వద్ద నమోదు చేసుకోవాలి. అప్పుడు చైనా నివాస అనుమతి జారీ చేస్తారు.  
  • చైనాలోని వైద్య విద్యా సంస్థలు, వాటిల్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి తదితర వివరాలతో ఏటా చైనా విద్యా శాఖ (ఎంఓఈ) ఓ జాబితా విడుదల చేస్తుంది. ఈ సమాచారం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని చైనాలోని భారతీయ ఎంబసీ వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. ఈ జాబితాలో లేని విద్యా సంస్థల్లో చేరవద్దని చైనా విద్యా శాఖే స్వయంగా విద్యార్థులను హెచ్చరిస్తోంది. ఎంఓఈ అనుమతించిన విద్యా సంస్థల్లో చదివిన వారికే భారతీయ వైద్య మండలి అర్హత సర్టిఫికెట్లను జారీ చేస్తుంది. అంతేకాదు, వీరే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసేందుకు అర్హులు. ఇందులో అర్హత సాధిస్తే చైనా లేదా భారత్ లో ఇంటర్న్ షిప్ చేసుకోవచ్చు. 
  • చైనాలోని వర్సిటీల్లో మెడిసిన్ కోర్సులో అడ్మిషన్ ను నేరుగా పొందే అవకాశం ఉంది. ఇందు కోసం ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో కనీసం 50 నుంచి 60 శాతం మార్కులైనా కలిగి ఉండాలి. యూనివర్సిటీలను బట్టి ఈ అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. 
  • సిలబస్ మాత్రం ఒకటే!వాస్తవానికి భారత్, అమెరికా, యూకేల నుంచి సేకరించిన పాఠ్యాంశాలతోనే చైనా కరికులమ్ రూపొందించింది.  చాలా కళాశాలలో హాస్టల్ వసతి ఉంటుంది .  చైనా అధికార భాష మాండరిన్ నేర్చుకోవడం పెద్ద కష్టమేమీకాదు. కొన్ని నెలల్లో ప్రాథమిక పరిజ్ఞానం వస్తుంది. ఏడాది తిరిగేసరికి చైనా భాషలో మాట్లాడడం సాధ్యమే. చైనాలో వైద్య విద్యలో భాగంగా రోగులను పరీక్షించాల్సి ఉంటుంది. వారితో మాండరిన్ లోనే మాట్లాడాల్సి ఉుంటుంది. కనుక ఈ బాష నేర్చుకోవడం కూడా తప్పనిసరి.
  • చైనాలో చదువుకుంటూ ఉద్యోగం చేసుకుని ట్యూషన్ ఫీజులు చెల్లించడానికి కుదరదు. 

విదేశీ విద్య కోసం రుణాలు..
డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల వంటి పూర్తి స్థాయి కోర్సులకే విద్యా రుణం లభిస్తుంది.
రుణానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? 
4 లక్షల రూపాయల రుణం వరకు హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే సహ దరఖాస్తు దారుడిగా తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామిలో ఒకరిని చేర్చాల్సి ఉంటుంది. 4 లక్షల నుంచి  7.5 లక్షల రూపాయల్లోపు రుణం కావాలంటే మాత్రం మరొకరి ష్యూరిటీ ఇవ్వాలి. 7.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో రుణానికి దరఖాస్తు చేసుకుంటే స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను బ్యాంకులు అడుగుతాయి. అలాగే, విద్యార్థి పేరు మీద ఎల్ఐసీ పాలసీని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 4 లక్షల రూపాయలకు పైబడిన రుణాల్లో 15 శాతం మొత్తాన్ని బ్యాంకుల వద్ద మార్జిన్ మనీగా ఉంచాల్సి ఉంటుంది. 

precautions:


  • విదేశీ వైద్య కళాశాలల్లో చదివే ముందు భారతీయ వైద్య మండలి (MCI ) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
  •  టూరిస్ట్ వీసా కంటే , విద్యార్ధి వీసా పైనే వెళితే మంచిది . 
  • ఏ కాలేజీ కి లేదా ఏ యూని వర్సిటీ లో చేరదామని అనుకొంటు న్నారో ,దానికి స్వదేశీ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ  గుర్తింపు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ,   ఉన్నత విద్యకి సంబంధించిన ఆయా ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్  ని మరియు ఆయా యుని వర్సిటీ ల లో విదేశీ విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన డైరెక్టర్ తో గానీ మెయిల్ ద్వారా సంప్రదించి కాలేజీకి ,చేయబోయే కోర్సుకి సరైన గుర్తింపు ఉందో లేదో సరి చూసు కోవాలి . 
  • మామూలుగా , స్టూడెంట్ వీసా ఏడాది గడువుతో జారీ చేస్తారు. దీన్ని కోర్సు పూర్తయ్యే వరకూ పొడిగించుకోవచ్చు. 
  • మెడిసిన్ కోర్సుల కోసం వెళ్లే విద్యార్థులు  అధికార సంస్థ జారీ చేసే సర్టిఫికెట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ (సీఈఏ) కాపీని వీసా కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఆయా దేశ  విదేశీ వ్యవహరాల శాఖ, సంబంధిత పత్రాలను అభ్యర్థికి సంబంధించిన దేశంలోని ఫారిన్ సర్వీస్ పోస్ట్ కు పంపిస్తుంది. ధ్రువీకరణ పూర్తయ్యాక అన్ని అర్హత పత్రాలతో వీసా ఇంటర్వ్యూ పిలుపు అందుతుంది.
  • మధ్య వర్తుల ప్రమేయం లేకుండా , ఫీజు నేరుగా యూనివర్సిటీలోనే చెల్లించడం సురక్షితం.  


  • విదేశాలలో లో మెడిసిన్ చదవడం పూర్తయ్యాక విద్యార్హతల పత్రాలను  ఆయా దేశ అధీకృత  ఉన్నత విద్యా శాఖ కి చెందిన మంత్రిత్వ శాఖ ద్వారా మరియు  కాన్సులర్ వింగ్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫారీన్ అఫైర్స్ ద్వారా ధ్రువీకరించుకోవాలి. దీన్నే రెడ్ రిబ్బన్ ప్రాసెస్ అంటారు. ఇది పూర్తయ్యాక ఒరిజినల్ పత్రాలను ఆయా దేశాలలోని భారతీయ ఎంబసీకి సమర్పించి అటెస్టేషన్ తీసుకోవాలి. భారత్ కు చేరుకున్న తర్వాత తిరిగి ఒరిజినల్ అర్హతా పత్రాల జిరాక్స్ కాపీలను ఎంసీఐకి సమర్పిస్తే... వారు భారతీయ ఎంబసీకి పంపించి అసలైనవా, కావా? అన్నది నిర్ధారించుకుంటారు.  
  • చదువు పూర్తయ్యాక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులు కావాలి. అప్పుడే ఆ డిగ్రీకి మన దేశంలో గుర్తింపు అన్నమాట!  


  •  విద్యా సంస్థకున్న పేరు, అక్కడున్న వసతులు, ఫ్యాకల్టీ ప్రమాణాల గురించి తెలుసుకుంటే మేలు. 
  • ఏజెంట్ల సాయంతో  విదేశాలకు  వెళ్లేవారు ముందుగా ఆయా ఏజెంట్ల విశ్వసనీయత గురించి విచారించుకోవాలి.

భద్రత విషయంలో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. వేళాపాళ లేకుండా ఎక్కడ పడితే అక్కడకు అదీ ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరం. అలాగే, దగ్గర పాస్ పోర్ట్, వీసా అన్ని వేళలా ఉంచుకోవాలి. పోలీసులు ఎప్పుడైనా, ఎక్కడైనా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే, వీటిని ఒక సెట్ జిరాక్స్ తీసి వేరుగా భద్రపరచుకోవడం మంచిది. ఏ దేశం లో చదుకు కొంటే ఆయా దేశాలలోని భారతీయ ఎంబసీ ఫోన్ నంబర్ రాసి పెట్టుకుంటే అత్యవసర సందర్భాల్లో సాయం కోరడానికి వీలవుతుంది.
ముఖ్యంగా దక్షిణ చైనాలో ఇటీవలి కాలంలో దొంగతనాలు, దోపిడీలు పెరిగిపోయాయి. వివిధ దేశాల విద్యార్థుల మద్య ఘర్షణలు సాధారణమైపోయాయి . 
మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.
కొత్త దేశానికి  వెళ్లిన వెంటనే భారతీయ ఎంబసీ కాన్సులర్ అధికారికి ఈ మెయిల్ లేదా లెటర్ ద్వారా భారతీయ విద్యార్థులు తమ పూర్తి వివరాలు తెలియజేయాలి.
All the best.

Comments