- భారత దేశ మూలాలను -పల్లె లను , పల్లీయులను ,అట్టడుగు బడుగు వర్గాలను --- పటిష్టం చేసే దిశలో బడ్జెట్ ఉంది .
- రకరకాల పన్నులు ,సెస్సు ల ద్వారా మొత్తం మన దగ్గర Rs. 20 లక్షల కోట్లు పోగవుతుంది .
- 2లక్షలు దాటిన ఎలాంటి వైనా వస్తువులు ,సేవలు పొందితే 1% సేవా పన్ను కట్టాల్సిందే .
- రైతు సంక్షేమానికి 35 వేల కోట్లు ,భూగర్భ జల సమృద్ధికి 60 వేల కోట్లు , నాబార్డ్ ద్వారా సాగునీటి కోసం 20వేల కోట్లు , పంట భీమా పధకం అటూ ఇటూ గా మొత్తానికి లక్ష కోట్లు రైతన్నల కోసం , కోటి ఎకరాలు సాగులోకి తీసుకు రావడం కోసం .... కేటాయించారు .
- వ్యవసాయ ,పశు గణాభివృద్ధి , జీవాల పోషణ , తోటలు ,ఆహార శుద్ధి , అగ్రో పరిశ్రమలు, రైతు సంక్షేమం --- వీటికి పెద్ద పీట వేసారు .
- "ఉపాధి హామీ పధకానికి - వ్యవసాయ పనులకు" ముడి పెట్టాలని ఎప్పటి నుండో చెబుతున్న చంద్ర బాబు మాటకి విలువిచ్చారు .
- అగ్రో పరిశ్రమ లలోకి 100% విదేశీ నిధుల ప్రవాహానికి గేట్లు ఎత్తారు .
- నైపుణ్య అభివృద్ధి కోసం 5000 కేంద్రాల ఏర్పాటు ,
- రైతుల మేలు కోసం 0.5 % కృషి కళ్యాణ్ సెస్సు ,
- పండిన పంటలకు మంచి ధర రైతుకి అందివ్వడానికి , జాతీయ స్థాయి లో రైతు మార్కెట్ ఏర్పాటు ,
- మౌలిక వసతుల నిర్మాణానికి పెద్ద కేటాయింపులు ---- మొత్తానికి గ్రామాలలో ఉంటూ బతుకీడుస్తున్న 60% గ్రామీణులకు ఈ బడ్జెట్ ఓ మేలి మలుపు !
- బడ్డీ కొట్లు ,కిరాణా దుకాణాలకు ఇక శలవలు లేవు . సూపర్ మాల్స్ పోటీని తట్టుకొనే టట్లు 24*7*365 వారు వ్యాపారం చేసు కోవచ్చు .
నాగలి చెక్కితే రైతురా ... తలచి ఊత మిస్తే దైవము రా
ఈ విషయం మోదీ కి బాగా తెలుసు .
Comments
Post a Comment