Skip to main content

అమెరికా వెళుతున్నారా..?

ఆంధ్ర జ్యోతి వారి సౌజన్యం తో ఇచ్చిన ఈ సమాచారాన్ని అందరికీ ముఖ్యంగా విద్యార్ధులకు అందిస్తారని ఆశిస్తూ .... 

ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాకు మార్గదర్శకాలు
  • మీరు ఎంచుకున్న యూనివర్సిటీ, కోర్సు.. గుర్తింపు పొందినవో లేవో సరి చూసుకోండి. కొన్ని సందర్భాల్లో యూనివర్సిటీ గుర్తింపు పొందినా, కొన్ని కోర్సులకు గుర్తింపు ఉండదు.
  • అమెరికాలోని యూనివర్సిటీలో ‘యూఎస్‌ ఫెడరల్‌ గవర్నమెంట్‌’తో కానీ.. ‘కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అక్రిడిటేషన్‌’ గుర్తింపు కానీ పొందాలి.
గుర్తింపు పొందిన యూనివర్సిటీల వివరాలు
  • అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు పొందిన వర్సిటీలు, కోర్సుల వివరాల జాబితాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీల ప్రస్తుత జాబితా కోసం ఈ క్రింది లింక్‌ను క్లిక్‌ చేయండి...
  • http:\\www.prasadthotakura.com/services/accrediteduniversitiesprograms.pdf  లేదా మీరు ఎంచుకున్న యూనివర్సిటీకి గుర్తింపు ఉందో లేదో తెలుసుకోవడం కోసం కింది లింక్‌ను కూడా క్లిక్‌ చేసుకోవాలి.
  • http:\\www.chrea.org/search/search/asp
యూనివర్సిటీలో ప్రవేశం పొందటానికి కావాల్సినవి 
  • యూనివర్సిటీని ఎంచుకున్న తరువాత, ప్రవేశ ప్రక్రియ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ప్రతి యూనివర్సిటీకి ప్రవేశ ప్రక్రియ విధానాలు వేర్వేరుగా ఉంటాయి.
  • మీ అకడమిక్‌ డిగ్రీతోపాటు టోపెల్‌/జిఆర్‌ఇ/జిమాట్‌ స్కోర్స్‌ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి.
దరఖాస్తు 
  • దరఖాస్తు, కావాల్సిన సమాచారం కోసం యూనివర్సిటీని సంప్రదించాలి.
  • మీ డిగ్రీని ఈ క్రింది జాబితాలోని ఏదైన ఒక ఎడ్యుకేషనల్‌ క్రిడేన్షియల్‌ ఎవాల్యూయేషన్‌ ఏజెన్సీకి పంపి.. మీ డిగ్రీ యూఎస్‌ఏలో ఏ డిగ్రీతో సమానమో తెలుసుకోవాలి.
వ్యయ ప్రణాళిక అంచనా 
అమెరికాలో మీ మొత్తం విద్యాభ్యాసం, వసతి, ఆహార ఖర్చుల వివరాలను ముందే అంచనా వేసుకోండి. 
కొన్ని సాధారణ ఖర్చులు : దరఖాస్తు, టెస్ట్‌ ఫీజులు, ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, అమెరికా ప్రయాణ ఖర్చులు, వసతి, ఆహారం ఖర్చులు, యూనివర్సిటీ సెలవు దినాల్లో అదనపు ఖర్చులు, దుస్తులు, వ్యక్తిగత ఖర్చులు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ఆటో ఇన్సూరెన్స్‌ (అవసరమైతే)....
  • స్టూడెంట్‌ వీసా రకాలు: ఎఫ్‌-1.. విద్యాభ్యాసం కొరకు, జె-1..ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు, ఎం-1.. వృత్తి విద్యా కోర్సుల కోసం
  • దరఖాస్తులను పరిశీలించి అర్హతనుబట్టి వర్సిటీ 1-20ఫారం అందిస్తుంది.
  • 1-20లో వివరాలు మీ పాస్‌పోర్ట్‌లోని వివరాలతో సరిచూసుకోవాలి.
  • వీసా దరఖాస్తుకు 1-901 ఫీజు చెల్లించాలి. ఈ రసీదుతో ఎఫ్‌-1 వీసా కోసం యూఎస్‌ కాన్సులెట్‌ లేదా ఎంబసీకి దరఖాస్తు చేసుకోవాలి.
గమనిక: గుర్తింపు పొందిన యూనివర్సిటీలు తాము విదేశీ విద్యార్థులను చేర్చుకుంటున్నామని ముందుగా హోంల్యాండ్‌ సెక్యూరిటీకి సమాచారం అందిస్తాయి. మీరు చేరబోయే యూనివర్సిటీ 1-17 ఫారం సమర్పించిందా లేదా అని ధృవీకరణకు..www.prasadthotakura.com. formi-17approeduniversities.pdf 

ఆర్థిక వనరులు 
  • మీరు అమెరికాలో విద్యాభ్యాసం చేయడానికి అవసరమయ్యే ఖర్చులను ముందుగానే అంచనా వేసుకొని ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలి.
  • ప్రైవేటు సంస్థల ద్వారా ఆర్థిక చేయూత: అమెరికాలోని కొన్ని ప్రైవేటు సంస్థలు, నాన్‌ ప్రాఫిట్‌ సంస్థలు (ఎన్‌జీవో) అర్హత కలిగిన విద్యార్థులకు కొంతవరకు ఆర్థిక సహాయం చేస్తాయి. మరింత సమాచారం కోరకు ఈ కింది వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
  • http://grantspace.org./tools.knowledge-base/individualgrantseekers/ studunts/funding-for-international-students
  • యూనివర్సిటీల ద్వారా.. : కొన్ని యూనివర్సిటీల్లో అంతర్జాతీయ విద్యార్థులకు చేయూత అందించడానికి సొంత ఆర్థిక వనరులను కలిగి ఉంటాయి. మీరు ఎంచుకున్న యూనివర్సిటీ ఇటువంటి సదుపాయం అందిస్తుందో లేదో ఆ యూనివర్సిటీ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలి.
అమెరికాలో ఉన్నప్పుడు పాటించాల్సినవి
  • అమెరికాలో సోషల్‌ సెక్యూరిటీ నెంబర్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
  • అర్హత కలిగినచో డ్రైవింగ్‌ లైసెన్సు కూడా పొందవచ్చు.
  • అమెరికాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం..http://prasadthotakura.com/safetyguidelines.pdf
స్టూడెంట్‌గా ఉన్న సమయంలో ఉపాధి అవకాశాలు
  • ఎఫ్‌-1వీసా ఉన్న విద్యార్థులు వర్సిటీ పరిధిదాటి ఉద్యోగంచేయకూడదు.
  • ప్రాంగణంలో వెసులుబాటుఉంటే వారానికి20గంటలు పనిచేయవచ్చు.
  • ఎఫ్‌-1వీసా విద్యార్థులు అమెరికాలో తమ కోర్సు పూర్తికాలానికి 60 రోజులు అదనంగా మాత్రమే ఉండటానికి అర్హులు.
  • సైన్స్‌, ఇంజనీరింగ్‌, టెక్నాలజి, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు ఓపీటీ నిమిత్తం తొలుత12, తర్వాత17 నెలలు అదనంగా ఉండటానికి అర్హులు.
  • ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా విద్యార్థులు తమకు జారీచేసిన 1-20 ఫారంలోని గడువు ముగిసేలోపు చదువు పూర్తి చేయాలి.
అమెరికా ఎయిర్‌ పోర్టులో పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ ఇంటర్వ్యూ
అమెరికాలో దిగిన తరువాత ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మీ అకడమిక్‌ ప్లాన్స్‌, ఆర్థిక వనరులపై ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
డాక్యుమెంట్లకు సరిపోయేలా తడబాటులేకుండా సమాధానాలివ్వాలి. 
విద్యాభ్యాసకాలంలో ఉద్యోగం చేయబోమని సమాధానమివ్వాలి.
ఈ సమాచారాన్ని ప్రామాణికమైన వనరుల నుంచి సేకరించారు. నిబంధనలు తరచూ మారుతుంటాయి. తాజా సమాచారాన్ని తెలుసుకొని ధృవీకరించుకోవాలని డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ తెలిపారు.

వీసా ఇంటర్వ్యూకు అవసరమైన డాక్యుమెంట్‌లు
  • పాస్‌పోర్ట్‌: మీ పాస్‌పోర్ట్‌ గడువు అమెరికాలో మీరు నివశించే కాలం కన్నా అదనంగా ఆరు నెలలు కాలపరిమితి కలిగి ఉండాలి.
  • డీఎస్‌-160 కొరకు ఈ కింది లింకు ద్వారా ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. http://ceac.state.gov/genniv/
  • అప్లికేషన్‌ఫీజు చెల్లింపు, రశీదు: ఇంటర్వ్యూకు హాజరయ్యే తేదీ కన్నా ముందే మీరు కట్టిన అన్నిఫీజుల రశీదులను మీ వద్దే ఉంచుకోవాలి.
  • ఫొటో: డీఎస్‌-160 ఆన్‌లైన్‌లో పూరించేటపుడు ఫొటో జత పరచాలి.
  • సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎలిజిబిలిటి ఫర్‌ ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా: యూనివర్సిటీ మీకు పంపిన 1-20 ఫారం మీ దగ్గరే ఉంచుకోవాలి.
  • మీ డిగ్రీలు, మార్కుల జాబితాలు, సర్టిఫికెట్లు మీ దగ్గరే ఉండాలి.
  • టోఫెల్‌/జిఆర్‌ఇ/జిమ్యాట్‌ స్కోర్‌ కార్డుల వివరాలు దగ్గరే ఉండాలి.
  • విద్యాభ్యాసం తర్వాత స్వదేశంవెళ్లాల్సి ఉందని రుజువు చేయగలగాలి.
  • ఖర్చులకు సరిపడా ఆర్థికవనరులు మీవద్ద ఉన్నాయని ధృవపరచాలి.
వీసా ఇంటర్వ్యూ.. 
  • ఇంటర్వ్యూ సమయంలో కాన్సులర్‌ ఆఫీసర్‌ మీ డాక్యుమెంట్‌లను పరిశీలించి, మీరు అర్హులనిభావిస్తే ఎఫ్‌-1 వీసా అందజేస్తారు.
  • అమెరికా ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • అమెరికాలో ప్రవేశానికి పాస్‌పోర్ట్‌, ఎఫ్‌-1వీసాలను సరి చూసుకోండి.
  • వీసాపై యూనివర్సిటీ పేరు, వీసా క్లాసిఫికేషన్‌ను సరిచూసుకోవాలి.
  • ఎఫ్‌-1 వీసాపై తొలిసారి అమెరికాలో ప్రవేశించేవారికి కోర్సు మొదలయ్యే తేదీకన్నా 30రోజులు ముందుమాత్రమే అనుమతిస్తారు.
  • ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూలో కాన్సులేట్‌ అధికారి అందించిన సీల్డ్‌ కవర్‌ను అలాగే అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసర్‌కు అందించాలి.
వద్ద ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్‌లు
  • ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసా, పాస్‌పోర్ట్‌ (సీల్డ్‌ కవర్‌తో సహా)
  • ఫారం 1-20 లేదా డీఎస్‌- 2019
  • ఫారం- 1-797- ఫీజు చెల్లించిన రశీదు
  • ఆర్థిక వనరులకు సంబంధించిన డాక్యుమెంట్‌లు.
ట్యూషన్‌ ఫీజు రశీదులు 
  • మీ విద్యా సంబంధమైన పత్రాలు
  • చేరబోయే వర్సిటీతో మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన డిఎస్‌వో లేదా ఆర్‌వో పేరు వివరాలు.

Comments