Skip to main content

డాక్టర్స్ పై ప్రభుత్వ వివక్ష . నిర్వీర్య మైతున్న MCI ?

ఈ దేశం లో ఇంజనీరింగ్ ,సాంకేతిక విద్య లకి కావలసిన టీచర్స్ ని , టీచర్స్ జీతాలని , కాలేజీ  ప్రమాణాలను
నిర్ధారించడానికి స్వయం సంపత్తి ,స్వయం నియంత్రణ ఉన్న UGC  గ్రాంట్స్ కమిషన్ ఉంది . దీనివలన నిర్ణయాలు త్వరితగతిన జరగడమే కాక , ఇంజనీరింగ్ ,ఆర్ట్స్ కాలేజీ ఆచార్యుల జీతాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి .
కాని ,ఎంతో  ముఖ్యమైన మెడికల్ విద్య ని పంచే కాలేజీల కు కేవలం గుర్తింపుని సిఫారసు చేసే కేంద్రం లాగ, MCI  ని వాడు కొంటున్నారు . అక్రిడేషన్ అధికారం ,జీతాలను పెంచే అధికారం , కాలేజీలను స్వయం గా నియంత్రించే అధికారం .... అలాగే పెద్ద హాస్పిటల్స్ మరియు సంస్థల మీద అధికారం లేని కీలుబొమ్మ గా
MCI ని మార్చి వేశారు . ఒక్క మాటలో చెప్పా లంటే అటానమస్ సంస్థ ఐన  MCI   ని కేవలం సిఫార్స్ లు చేసే వ్యవస్థ గా  కుంగ దీశారు .

ఏ నిర్ణయ మైనా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అమలయ్యే అవకాశం లేదు .
చిన్నపాటి బడి పంతుళ్ళకి  ఇచ్చే జీతం కూడా డాక్టర్స్ కి ఇవ్వడం లేదు . ------
 NATCON-2015 కౌన్సిల్ సమా వేశాలలో ఈ విషయాలను కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పింది వేరే ఎవరో కాదు . , MCI  అకాడెమిక్ కమిటీ చైర్మన్ - సాక్షాత్ వేద ప్రకాస్ మిశ్రా .
కాబట్టి ,వైద్య సోదరులారా ! అటు MCI  ,ఇటు  IMA కలిసి పనిచేయవలసిన అవసరం నేడు ఉంది .
ఈ విషయం లేటు గా ఐనా MCI కూడా    గుర్తించింది . 

Comments