Skip to main content

Press note on IMA SATYAGRAHA.

                                అఖిల భారతీయ వైద్యుల సత్యాగ్రహం :                                                                              16-11-2015 తేదీన దేశ వ్యాప్తం గా   అన్ని హాస్పిటల్స్ బంద్ చేయ బడతాయి . కేవలం ఇన్ పేషంట్ లకు మాత్రమే వైద్య సర్వీసులు అంద  చేయ బడతాయి . ఎమర్జెన్సీ కేసులు ప్రభుత్వ హాస్పిటల్స్ కి వెళ్ళ వలసిందిగా మా మనవి . 
ఆ రోజున దేశ వ్యాప్తం గా  వైద్యులందరూ  ఒక ప్రదేశం లో సమావేశ మై తాము ఎందుకు ఈ నిర్ణయం తీసు కొన్నామో నాయకులకు ,అధికారులకు ,మీడియా సోదరులకు ,సామాన్య ప్రజానీకానికి తెలియ చేయడానికి -
ర్యాలీ లు , ప్రెస్ మీట్ లు ,మెమొరాండం సమర్పణ మొదలగు కార్య క్రమాలు చేస్తారు . 

ఏ వ్రుత్తి ఈ భువనం లో అత్యంత పవిత్రమైన వ్రుత్తి అని వేదాలు ,శాస్త్రాలు ఘోషించా యో ఆ వృత్తిని పాటించే వైద్యులు , నేడు వీధికెక్కి న్యాయం కోసం పోరాడే పరిస్థితి ఎందుకు దాపు రించిందో   ఒక్కసారి ఆలోచించండి ....
మా డిమాండ్స్ :
1. హాస్పిటల్ నమోదు నియంత్రణ చట్టం" (AP hospital registration&regulation Act, Clinical establishment Act,Fire safety Act ) నుండి చిన్న హాస్పిటల్స్ ని మినహాయించాలి .
A.అందుబాటులో వైద్యం కావాలీ అంటే .... చిన్న హాస్పిటల్స్ కి చట్టాలతో సంకెళ్ళు వేయొద్దు .
B.  వైద్య ఖర్చులను తగ్గించు కోవాలా ... చిన్న హాస్పిటల్స్ ని కాపాడండి .

2.. క్లినికల్ ఎస్టా బ్లిష్మెంట్  చట్టాన్ని సవరించాలి -
A. ఎమర్జెన్సీ సేవలు చేయడం లో నైపుణ్యం లేక పోయినా ,ప్రతి వైద్యుడు నిర్బంధం గా ఆయా సేవలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేయడం ఎంతవరకు సబబు ? 
B. కార్పోరేట్ హాస్పిటల్స్  కి ,చిన్న చిన్న హాస్పిటల్స్ కి ఒకే రకమైన విధి విధానాలు నిర్బంధం గా ఎలా అమలు చేస్తారు ? 
c. కార్పోరేట్ హాస్పిటల్స్ కి కొమ్ముకాస్తున్న ప్రభుత్వం చిన్న హాస్పిటల్స్ మూత  పడే విధం గా చట్టాలను చేయడం,
గ్రామాలలో ఉన్న  70% ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడం కాదా ? 

3. కేంద్ర మెడికల్ రక్షణ చట్టం రావాలి -
A. అత్యవసర సమయం లో ప్రాణ రక్షణ జరగాలీ అంటే ..... డాక్టర్స్ ని కాపాడే కేంద్ర మెడికల్ రక్షణ చట్టం రావాలి .
B . హాస్పిటల్స్ పై న ,డాక్టర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది పైన దౌర్జన్యం చేసిన వారిపై సరైన చర్యలు
    తీసుకోక పోవడం చట్టరీత్యా నేరం . 
4. నకిలీ వైద్యులను ,నకిలీ వైద్యాన్ని , క్రాస్ పతి వైద్యాన్ని అరికట్టాలి
 
A . హోమియో వైద్యులు హోమియో మందులే వాడాలి ... ఆయుర్వేద వైద్యులు ఆయుర్  వేద మందులే వాడాలి .
B. ఏ వైద్యం లో డిగ్రీ ఉంటే ఆ వైద్యమే చేయాలి .
C. ఆయుష్ వైద్యులు ఇంగ్లీష్ మందులు రాయకూడదు .
D. MBBS వారు చేయ వలసిన వైద్యాన్ని B.Sc వారితో
 చేయించాలని ప్రభుత్వం అనుకోవడం ఎంత వరకు సబబు ? 
E. B.Sc-సామాజిక ఆరోగ్యం " కోర్సు చదివిన వారిని డాక్టర్స్ లెక్క పరిగణించి వారితో పల్లెలలో నివసించే
వారికి వైద్యం చేయించా లను కోవడం అమానుషం . 
F.ఎప్పుడు , ఎలాంటి వైద్యం చేయాలో చెప్ప వలసింది డాక్టర్ ..... ప్రభుత్వం కాదు .
5. PC- PNDT చట్టాన్ని సవరించాలి .
A. స్కానింగ్ డాక్టర్స్ పై "మానవ హక్కుల వ్యతిరేక చర్యలు" ఆపండి ..
B. స్కానింగ్ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో వైద్యులను నిర్బంధించడం ఆపాలి . 

6. వైద్య సేవలను "వినియోగ దారుల రక్షణ చట్టం" నుండి మినహాయించాలి .
A. నష్ట పరిహారం రూపేణ కోట్లాది రూపాయల జరిమానా వైద్య వ్రుత్తి కే గొడ్డలిపెట్టు .
B. ప్రతి హాస్పిటల్ మరణాన్ని వైద్యుల నిర్లక్ష్యపు చేష్ట గా చూడ వద్దు .
C.వైద్య సేవలలో జరిగే ప్రమాదాలను  వైద్యుల నిర్లక్ష్యాల కింద చూడవద్దు 
D.మెడికల్ బోర్డ్ రిపోర్ట్ లేకుండా డాక్టర్స్ ని అరెస్ట్ చేయ డం చట్టరీత్యా నేరం . 
E. లేబ రేటరీలు ,మందులు ,నర్సింగ్ సిబ్బంది ,వైద్యులు –ఇలా ఎంతో  మంది నిపుణులు పనిచేసే అత్యంత సంక్లిష్ట మైన ఆరోగ్య సేవా రంగం లో , కేవలం వైద్యులనే టార్గెట్ చేయడం ఎంతవరకు న్యాయం ? 
7. ప్రజారోగ్యానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి  .
A.ఆరోగ్య రంగానికి మన దేశ జి డి పి లో 5% కేటాయించి ప్రజారోగ్యా న్ని కాపాడాలి . 
B. నకిలీ మందులను అరికట్టే యంత్రాంగాన్ని పటిష్ట పరచాలి . 
C. నిఖార్సైన నాణ్యమైన మందులు , వైద్య పరికరాలు అందరికీ అందుబాటులో ఉండే విధం గా ధరల
నియంత్రణ ,స్థిరీకరణ ప్రభుత్వం వెంటనే చేపట్టాలి . 
D. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఖాళీ గా ఉన్న పోస్ట్ లను వెంటనే పూరించి ప్రాధమిక వైద్య కేంద్రాలను ,ట్రామా కేంద్రాలను
పటిష్ట పరచాలి.  
E. ఎలాంటి వైద్య అర్హతా లేని వారు వాడ వాడ లా వైద్యం చేస్తుంటే నిమ్మకు నీరెత్తి నట్లు ఊర కుంటున్న ప్రభుత్వం,
ప్రభుత్వ హాస్పిటల్స్ లో కనీస పారి శు ధ్యాన్ని కాపాడలేని ప్రభుత్వం , ప్రైవేట్ వైద్య రంగాన్ని 200 చట్టాలతో
కునారిల్లంప చేయడం భావ్యమా ? 
F.  ప్రజారోగ్యం లో అట్ట డుగు న ఉన్న మన భార త  దేశానికి కావలసిన ఆర్ధిక మరియు మానవ వనరులను  
పూరించే ప్రయత్నం చేయకుండా ఉన్న వైద్యులను,చిన్న హాస్పిటల్స్ ని  చంపుకోవడం -మన కొమ్మను మనమే నరుక్కోవడమే !

                           మిత్రులారా ! గుర్తుంచు కోండి .... వైద్యుడు దేవుడు కాదు......
నాయకులు ,సేవాసంస్థలు ,న్యాయ మూర్తులు ,మీడియా సోదరులు ,శాసన సభ్యులు ,ప్రభుత్వం,ఉద్యోగులు , రైతులూ .... అందరూ ఒక్క సారి ఆలోచించండి ..
న్యాయమైన మా డిమాండ్ లు పరిశీలించండి…
డా . శ్రీనివాస రాజు 
చైర్మన్ -హాస్పిటల్ బోర్డ్ -ఐ .ఎమ్ . ఎ  ఆంధ్ర ప్రదేశే 
9490172569                           

Comments