Skip to main content

భారతీయ వైద్యుల సత్యాగ్రహం :

ఏ వ్రుత్తి ఈ భువనం లో అత్యంత పవిత్రమైన వ్రుత్తి అని వేదాలు ,శాస్త్రాలు ఘోషించా యో ఆ వృత్తిని పాటించే వైద్యులు , నేడు వీధికెక్కి న్యాయం కోసం పోరాడే పరిస్థితి ఎందుకు దాపు రిమ్చిం దో ఒక్కసారి ఆలోచించండి .... నాయకులు ,సేవాసంస్థలు ,న్యాయ మూర్తులు ,మీడియా సోదరులు ,శాసన సభ్యులు ,ప్రభుత్వం,ఉద్యోగులు , రైతులూ .... అందరూ ఒక్క సారి ఆలోచించండి ..
న్యాయమైన మా డిమాండ్ లు పరిశీలించండి
1.అందుబాటులో వైద్యం కావాలీ అంటే .... చిన్న హాస్పిటల్స్ కి చట్టాలతో సంకెళ్ళు వేయొద్దు .
2."హాస్పిటల్ నమోదు నియంత్రణ చట్టం" నుండి చిన్న హాస్పిటల్స్ ని మినహాయించాలి .
3. వైద్య ఖర్చులను తగ్గించు కోవాలా ... చిన్న హాస్పిటల్స్ ని కాపాడండి .
4. అత్యవసర సమయం లో ప్రాణ రక్షణ జరగాలీ అంటే ..... డాక్టర్స్ ని కాపాడే కేంద్ర మెడికల్ రక్షణ చట్టం రావాలి .
5.ఎప్పుడు , ఎలాంటి వైద్యం చేయాలో చెప్ప వలసింది డాక్టర్ ..... ప్రభుత్వం కాదు .
6.హోమియో వైద్యులు హోమియో మందులే వాడాలి ... ఆయుర్వేద వైద్యులు ఆయుర్ మందులే వాడాలి .
7. ఏ వైద్యం లో డిగ్రీ ఉంటే ఆ వైద్యమే చేయాలి .
8. ఆయుష్ వైద్యులు ఇంగ్లీష్ మందులు రాయకూడదు .
9. స్కానింగ్ డాక్టర్స్ పై "మానవ హక్కుల వ్యతిరేక చర్యలు" ఆపండి . PNDT చట్టాన్ని సవరించాలి .
10. వైద్య సేవలను "వినియోగ దారుల రక్షణ చట్టం" నుండి మినహాయించాలి .
11. నష్ట పరిహారం రూపేణ కోట్లాది రూపాయల జరిమానా వైద్య వ్రుత్తి కే గొడ్డలిపెట్టు .
12. ప్రతి హాస్పిటల్ మరణాన్ని వైద్యుల నిర్లక్ష్యపు చేష్ట గా చూడ వద్దు .
                           మిత్రులారా ! గుర్తుంచు కోండి .... వైద్యుడు దేవుడు కాదు......

Comments