Skip to main content

మనకేం కావాలి ? మనం ఏం కోరాలి ?

ఆర్థిక కోణంలో చూసినప్పుడు హోదాతో పోలిస్తే ప్రత్యేక ప్యాకేజీ మేలని  కొందరు  ఆర్థిక వేత్తలు ,ఆంధ్ర ఆర్ధిక శాఖ వర్గాలు బలంగా భావిస్తున్నాయి.
పూర్వం ,అంటే 2015 కి ముందు ,కేంద్ర ఆదాయంలో 32 శాతం వాటాను రాష్ట్రాలకు ఇచ్చేవారు. ఇప్పుడు హోదాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకూ దానిని 42 % కి  పెంచి ,  రాష్ట్రాలకు  వివిధ పద్దుల కింద   ఇచ్చే సాయాన్ని నిలిపివేశారు.

 ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు  ఇచ్చే - A.వార్షిక ప్రణాళిక సాయం, B. ప్రత్యేక ప్రణాళికా సాయం, C. ప్రత్యేక కేంద్ర సహాయాన్ని 2015- 16 నుంచి పూర్తిగా నిలిపివేశారు.
అనగా , ప్రత్యేక హోదా సాధించు కొన్నా కూడా ఆర్ధిక ఫలితం ఉండదు !
ప్రత్యేక హోదా ఉన్న  రాష్ట్రాలకు , కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా వస్తాయన్నది పెద్ద ఆకర్షణ. కానీ, కేంద్రం ఇచ్చే నిధులు బాగా తగ్గిపోతున్నప్పుడు ఆ హోదా పెద్దగా లాభసాటి కాదు. ఉదాహరణకు , ఇదివరకు కేంద్రం  ఒక లక్ష  ఇచ్చినప్పుడు అందులో 90000 ఉచితం గా దక్కేది . ఇప్పుడు  కేంద్ర ఇచ్చేదే 10వేలు అయినప్పుడు , అందులో 9000 మాత్రమే ఉచితం గా దక్కుతుంది . 
అంటే , ప్రత్యేక హోదా ఉన్నా లాభం లేదు . 

 ప్రత్యేక  హోదా ఉంటే విదేశాల నుంచి వచ్చే రుణాల్లో కూడా 90 శాతం గ్రాంటుగా దక్కడం పెద్ద ఆకర్షణ . 
ఒకవేళ కేంద్రం మనకు 5 ఏళ్ళు ప్రత్యేక  హోదా ఇచ్చినా ,  ఈ కాస్త వ్యవధిలో విదేశాల నుండి 
ఎంత ఋణం తేగలం ?  
ఇంత తక్కువ వ్యవధిలో,  విదేశీ రుణ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు తయారు చేయడం, వాటికి విదేశీ సంస్థలతో (ADB,world bank,etc...) ఆమోదం పొందడం, నిధులు రావడం అంత తేలిక కాదు. కొన్ని నిధులు వచ్చినా వాటి పరిమాణం పెద్దగా ఉండకపోవచ్చు. 
 కాబట్టి , విషయాన్ని రాజకీయ కోణం లో కాక ఆర్ధిక పరం గా మదింపు చేసు కోవడం మనకు మంచిదేమో ?- రాజకీయ పార్టీలు ముఖ్యం గా మేధావులు ,ఆర్ధిక నిపుణులు మరొక్క సారి ఈ దిశలో దృష్టి సారించి ఏది మనకు మేలో త్వరలో తేల్చి ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయాలి . 

Comments