ఉప్పు సత్యాగ్రహం సమయం లో గోరా , సరస్వతి గోరా ల కు పెద్ద కుమారుడు గా జననం, నాస్తిక వాదం తో మూడ నమ్మకాలపై యుద్ధం, సంస్కార్ అనే సంస్థ ద్వారా స్టువర్ట్‌పురం దొంగల్లో పెను మార్పు, నిజామాబాద్ జిల్లాలో జోగినీ వ్యవస్థపై అలుపెరగని పోరాటం - ఇవన్నీ తన గుండె బలం తో ,సాంఘిక శ్రద్ధతో అత్యంత జాగరూకత తో తన జీవిత పర్యంతం సాగించిన మానవతా వాది, 87 ఏళ్ల శ్రీ గోపరాజు లవణం కొంత కాలంగా గుండెజబ్బుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రముఖ హేతు వాది , సంఘ సంస్కర్త , ప్రముఖ వైద్యులు డా సమరం గారు వీరి సోదరుడు .
మనిషి ఎలా జీవించాలో ,సమాజానికి ఎలా సేవ చేయాలో చేసి చూపించి, మనందరికీ మార్గ దర్శకులు గా నిలిచిన శ్రీ గోపరాజు లవణం మనందరికీ స్పూర్తి ప్రదాత . వారి అడుగుజాడలు ఆంద్ర దేశం లో అజరామరం .
కుటుంబ సభ్యులకు , గోరా సమాజానికి సంతాపాన్ని తెలియ చేస్తూ ఐ . ఎం . ఎ ప్రగాడ శ్రద్దాంజలి ఘటిస్తుం ది .
Comments
Post a Comment