Skip to main content

Open letter to press&Media

చట్టాలను కాపాడ వలసిన ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం తో  ,నిర్వీర్యం  గా కునారిల్లు తుంటే   నకిలీ వైద్యులు ,నకిలీ లాబ్స్  నుండి ప్రజలను ఎవరు కాపాడ గలరు ?
కష్ట పడి  ఆరుగాలం శ్రమించి చదివి డాక్టర్ ఐన వారి పర్యవేక్షణ కి 27 చట్టాలు పెట్టిన ప్రభుత్వం నకిలీ సర్టి ఫికేట్ లతో వైద్యము  చేసే వారిని ,నకిలీ మందులు తయారు చేసి విక్రయించే వారిని అదుపు చేయడానికి సరైన చట్టాన్ని ఒక్కటి కూడా అమలు చేయడం లేదు . రిటైల్ మందుల దుఖాణా  లలో ఫార్మసీ చదివిన వారే మందులు అమ్మాలి . కాని ,అది ఎంతవరకు అమలవ్వు తుందో మనందరికీ తెలిసిన విషయమే !
ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదు . 
పల్లె లలో వైద్యులకొరత గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు గానీ , దానికి సరైన కారణం అక్కడ మెడికల్  మౌలిక సదుపాయాల(infrastructure ) కొరతే  అని ఎవ్వరూ ఎందుకు ఆలోచించరు ?  
దక్షిణ భారత దేశం లో మెడికల్ కాలేజీలు పుట్ట కొక్కు ల్లా వ్యాప్తి చేస్తున్నారు . కానీ ఉత్తర మరియు తూర్పు భారతం లో మెడికల్  కాలేజీలు ఎందుకు కట్టరు ?
ఎప్పుడైతే వైద్య విద్య అంగట్లో సరకు గా మారిందో , వైద్య సేవలు కూడా వ్యాపార వస్తువు గా మారడం లో 
  వింత ఏముంది ? 
ఎప్పుడైతే వైద్య సేవలను వినిమయ వస్తువు గా చూడటం మొదలు పెట్టి వినియోగ రక్షణ చట్ట పరిధిలో బిగించారో అప్పుడే వైద్యం వ్యాపార మ్ గా మారడం లో ఆశ్చర్యం ఏముంది ?
వైద్యశాల లుండే భవనాల కు  ,వాటిలో వినియోగించే నీరు ,విద్యుత్  మొదలగు మౌలిక సదుపాయాలకు వాణిజ్య పరమైన ఛార్జీలను ,పన్నులను ప్రభుత్వం విధించి ముక్కు పిండి వసూల్ చేయడం మొదలెట్టిం దో అప్పుడే హాస్పిటల్స్ పెట్టుబది దారీ  పంధా ని(corporate ways) అవలంబించ డం లో తప్పు  ఏముంది ?


ఎన్నో రకాల సేవారంగాలు ఉన్నా వైద్య రంగానికి ఉన్న ప్రాముఖ్యత ,వైద్యులకున్న గురుతర బాధ్యతా మరే రంగానికి గానీ ,మరే ఇతర వ్రుత్తి నిపుణులకు గానీ ఉండదు . అయినా వైద్య వృత్తిని ,వైద్యులను టార్గెట్ చేస్తూ అటు ప్రభుత్వమూ , ఇటు సమాజమూ చేస్తున్న భయంకర చట్టాలు ,అమానుష కృత్యాలు 
తలచు కొంటే ,ఏ  విద్యార్ధీ మనదేశం లో వైద్య వృత్తిని చేపట్టడు ! దీని ఫలితం ఎంత భయంకరం గా ఉంటుందో ఇప్పుడే ఉహించ లేము . 
వైద్యులను బందిపోటుల  లెక్క న చూస్తున్న సమాజాన్ని ఏమని చెప్పి మార్చగలం ?

  • ఐ.సి.యు ల ద్వారా డాక్టర్స్ ఎంత డబ్బు గుంజు తున్నారో అని గుండెలు బాదుకొంటారు గానీ ఐ.సి.యు అనేది ఎంతమందికి ప్రాణ దానం చేసిందో ఎవ్వరూ గమనించరు . 
  •  ఐ.సి.యు లను నడపడానికి రోజుకి ఎంత ఖర్చు అవ్వుతుం దో , ఆయా పరికరాలను సమ కూర్చు కోవడానికి ఎంత పెట్టుబడి పెట్టాలో , ఆ అప్పులను తీర్చడానికి నెల నెలా వడ్డీలు ఎంత  కట్టాలో  ఎవ్వరికీ పట్టదు . 
  • బే సికల్ గా వైద్యం ఫ్రీ గా దొరకాలని సమాజం కోరిక . వైద్యుడు నిరంతరం అందుబాటు లో ఉంటూ   క్వాలిటీ వైద్యం  ఎక్కువ ఫీజు తీ సు కోకుండా, వీలుంటే  ఫ్రీ  గా అందివ్వాలని ప్రతి ఒక్కడి కోరిక !




  • మేమందరం అందినకాడికి బొక్కుతాం ,డాక్టర్స్ మాత్రం సన్యా సుల వలె ఎలాంటి కోరికలు లేకుండా సమాజానికి కట్టు బానిస లెక్క సేవలు చేయాలి " అని ప్రతి ప్రభుత్వ అధికారి  కల !
  • మే ము శీ తల గదుల్లో ఖుషీగా ఉంటాం , మందులు,రక్తం ,టేకాలు ,మంచాలు ,నర్సింగ్ సిబ్బంది లాంటి అవసరమైన సదుపాయాలు ఏమీ లేక పోయినా డాక్టర్స్ మాత్రం ఏజన్సీ ఏరియాల్లో, పల్లెలలో   రాత్రనక పగలనక కష్ట పడి ప్రజల ని రక్షించ వలసిందే ! లేకుంటే వాళ్ళను తీ సి  పారేసి నకిలీ వైద్యులతో , పారామెడికల్ సిబ్బంది తో  పని కానిచ్చేస్తాం " ఇది మన ప్రభుత్వాల బెదిరింపు !
  •   ఎలాంటి రోగానికైనా , ఎంత ముదరబెట్టి కుళ్ళి పోయినా డాక్టర్స్  ప్రాణం పోసి బతికించా లి సిందే . లేకుంటే ఆ డాక్టర్ తోలు తీయా లి సిందే " - ఇది  ప్రతి కుహనా  రాజకీయ పార్టీ హుంక రింపు !

తప్పో ఒప్పో డాక్టర్స్ అయ్యాము . ఈ  పరిస్థితి ని ఎలా ఎదుర్కోవాలో  కాస్త ఆలోచించండి . 
ఎవ్వరి లో  ఏ ఐడియా  ఉందో !
అలాగే మనం కూడా కొంత స్వీయ పర్యవేక్షణ చేసు కోవాలి . 
ప్రతి IMA సభ్యుడు స్వీయ పర్య వేక్షణ ,పర పర్యవేక్షణ చేసు కోవాలి .
ఈ క్రమం లో మనం  కొన్ని సూత్రాలను గుర్తు చేసు కొందాం . 
1. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం -1956 మరియు వైద్య వ్రుత్తి  నైతిక నిబంధన నియమాలు-2002,ఇండియన్ మెడికల్ డిగ్రీ చట్టం - 1916 --- వీ టిని ఆధారం చేసుకొని మెడికల్ కౌన్సిల్ సంస్థ మన దేశం లో  వైద్య వృత్తిని ,వైద్యులను ,వైద్య విద్యను నియమ బద్దం చేస్తుంది .
మెడికల్ కౌన్సిల్ సంస్థ  (MCI ) కి , వైద్యుల పై అధికారం ఉంది కానీ వైద్య సంస్థ లపై మాత్రం అధికారం లేదు . ఉదాహరణ కు , వైద్య వ్రుత్తి  నైతిక నిబంధన నియమాలు-2002 ప్రకారం ,డాక్టర్ తన నైపుణ్యం గురించి  ప్రచారం చేసుకోవడం నేరం . కానీ ,  కార్పోరేట్ హాస్పిటల్ ప్రచారం చేసుకోవడం నేరం కాదు . వ్యక్తీ గత హోదాలో డాక్టర్ లు నైతిక విలువలు పాటించాలి . కానీ ,అదే ఓ సంస్థలో సభ్యులుగా వారు పాటించ వలసిన  నైతిక విలువల పై  MCI కి అధికారం లేదు .  అలాగే ఈ MCI లో నమోదు చేసుకొన్న వైద్యులపై  మాత్రమే MCI కి అధికారం ఉంది కానీ నమోదు కాని వైద్యులపైన కేవలం పోలీస్ వ్యవస్థ కి ,న్యాయ వ్యవస్థలకే పర్యవేక్షణ  అధికారం ఉంది . కాబట్టి ఫిర్యాదులను పోలీస్ మరియు మేజిస్ట్రేట్ వారికి కూడా సమర్పించాలి .

2. మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీసు చేయడానికి కనీస అర్హత  MBBS . అనగా  మెడికల్ కౌన్సిల్  వారిచే గుర్తింపబడిన మెడికల్ కాలేజీ లో  MBBS కోర్స్ చదివి తద్వారా పొందిన MBBS డిగ్రీ ని మెడికల్ కౌన్సిల్  సంస్థలో రిజిష్టర్ చేసుకొన్న తర్వాత మాత్రమే వైద్య సేవ చేయడానికి అర్హత వస్తుంది .
3. విదేశాలలో చదివిన వారికి బేసిక్ డిగ్రీ  MD అని ఇస్తారు . కానీ MD  అంటే మన దేశం లో స్పెషలిస్ట్ అని అర్ధం . దీనిని సాకుగా తెసుకొని చాలా మంది విదేశీ వైద్య విద్యార్ధులు వారి వారి బోర్డు లు ,ప్రిస్క్రిప్షన్ ల పై MD  అని వ్రాసి ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని తె లుస్తుంది . ఇదీ నేరమే .
4. నకిలే వైద్యులు గా పిలవ బడే  PMP / RMP ల  వద్దకు వైద్యం కోసం వెళ్ళడము ప్రమాదకరం . అనవసర మైన మందులు ,మోతాదుకు సంబంధం లేని మందుల వాడకం , తక్షణ రిలీఫ్ కోసం కార్టికో స్తేరాయడ్ ల వాడకం ఎంత హానికరమో మీ అందరికీ తెలుసు . PMP / RMP లు ఎడా పెడా ఇలాంటి మందులు వాడతారని
 జగమెరిగిన సత్యం .  జిల్లా వైద్యాధికారులు ఈ  విషయం లో  ప్రజలను కట్టడి చేయక పోతే ఎన్నో కోట్లు గుమ్మరించి అమలు చేసే ప్రభుత్వ ఆరోగ్య పధకాలు నిర్వీర్య మై పోయి నట్లే ! నాన్ బాంకింగ్ సంస్థల బారి నుండి ప్రజలను ఆర్ధికం గా రక్షించడానికి ఆయా సంస్థలను రద్దు చేసిన ప్రభుత్వం ప్రజల ఆరోగ్య రక్షణార్ధం నకిలీ డాక్టర్స్ ని ,నకిలీ మందుల వ్యవస్థలను ఎందుకు రద్దు చేయ లేక పోతుందో ప్రతి పౌరుడూ ఆలోచించాలి !

5. మెడికల్ కౌన్సిల్ గుర్తించని డిగ్రీలు,ఫెలోషిప్ లు  మామూలు గా  ప్రదర్సించ కూడదు . కానీ , వాటిని ఎలా పొందారో ,ఏ సంస్థ వాటిని ఇచ్చిందో వివరం గా అర్ధం అయ్యేటట్లు గా ప్రదర్శించు కోవచ్చు .
6. ఆయుష్ వైద్యులు,  మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీసు చేయడం నేరం . అలాగే మోడర్న్ మెడిసిన్ డాక్టర్ లు ఆయుష్ వైద్య విధానాలను ప్రాక్టీసు చేయకూడదు .
7. మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీసు చేసే హాస్పిటల్స్ లో ఆయుష్ వైద్యులను నియ మించడం నేరం .
8. The Andhra Pradesh Allopathic Private Medical Care Establishments (Registration and Regulation) Rules, 2007 ప్రకారం , ప్రతి హాస్పిటల్,లాబ్ ,క్లినిక్ - జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నుండి రిజిష్ట్రేషన్ నంబరు పొందాలి .అలా పొందిన హాస్పిటల్ మాత్రమే వైద్య సేవలు అందించాలని  చట్టం మనకు చెబుతుంది .  వైద్య అధికారులు కూడా  రిజిష్ట్రేషన్ లేని హాస్పిటల్స్ ని,లాబ్స్ ని  ఎలాంటి సంకోచం లేకుండా మూసివేయిమ్చాలి .

9. ప్రతి పౌరుడికీ , ముఖ్యం గా IMA సభ్యులకి కి గురుతర బాధ్యత ఉంది . ఎక్కడైనా ,ఎవరైనా  ఈ చట్టాలను ఉల్లంఘించి నట్లు అనుమానం వస్తే IMA సభ్యులు జిల్లా వైద్యాధికారికి , రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వారికి ఫిర్యాదు చేసి చట్టాన్ని కాపాడటం లో సహకరించాలి . అనుమానం ఉంటె వెంటనే ఆంధ్ర రాష్ట్ర మెడికల్ కౌన్సిల్  జిల్లా మానిటరింగ్ సభ్యుల కు,జిల్లా  ప్రభుత్వ వైద్య అధికారులకు  ఫిర్యాదు చేయాలి .

10. ఏ  సేవ లో అయినా పారదర్శకత , సచ్చీలత అత్యవసరం . వైద్య రంగం లో వీటి విలువ అపారం . రోగికి ,వైద్యునికి మధ్య ఉండే సంబంధం విశ్వాసం ,దయ ,నైపుణ్యం పై ఆధార పడి ఉంటాయి . సామాన్యుడిలో అపోహలు ,అపార్ధాలు వెల్లు వెత్తకుండా కాపాడు కోవలసిన బాధ్యత అటు వైద్యుల పైన ,ఇటు సమాజం పైనా సమానం గా ఉంది .
-డా . శ్రీ నివాస రాజు
చైర్మన్ - HBI IMA AP STATE

Comments