Skip to main content

రాజధాని రంగులు

ఎకరానికి సరా సరిన ఏడాదికి రూ . 50000/- పంట దిగుబళ్ళు కోల్పోతున్న తుళ్ళూరు మండల రైతాంగం  లో ఉన్న భయాలు ,అపోహలు తీర్చ వలసిన బాధ్యత ఆంద్ర రాష్ట్ర ప్రజ లందరి పై ఉంది .
అలాగే సుమారు 17 గ్రామాలలో ని , 20000 కుటుంబాలు అనాదిగా చేస్తున్న వ్యవసాయాన్ని
వదిలి ఏదైనా మరో వృత్తిని చూసు కోవాలి .
భూమిని కోల్పోవడ మొక బాధ , ఆపై ఏపని చేయాలో అయోమయం ,ప్రభుత్వం ఇస్తున్న హామీలపై అప నమ్మకం ---ఇవన్నీ వేరే పార్టీలవారి నోట్లో బడి , రాజకీయ రంగు పులుము కోక ముందే
బాధ్యత గల అధికారులు ,మంత్రులు ,సామాజిక కార్య కర్తలు ,వ్రుత్తి నైపుణ్య మెళకువలు
తెలిసిన సంస్థలను బాగ స్వాములను చేస్తూ ఒక అభివృద్ధి కమిటీని ఆయా గ్రామాలకు పంపి వారిలో ఉన్న భయాలను పోగొట్టి ,వారికి ఇతర వృత్తులలో నైపుణ్యత ను అందించే ఏర్పాటు చేయాలి .

కొత్త రాజధాని రూపు రేఖలు రెక్క తొడిగే సమయానికి , ఎకరం కోల్పోయిన రైతుకి ,
గజానికి సుమారు రూ . 30000 చొప్పున 1000గజాలకు  3కోట్లు ,
రూ . 50000/-చొప్పున 100 గజాలకు ఇంకో అరకోటి ఆ దాయం వస్తుంది .
అలాగే ,ప్రస్తుతం వారున్న ఇళ్ళు కూడా రాజధాని ప్రాంతం లో నే ఉండటం వలన వాటి
విలువ కూడా బాగా పెరుగుతుంది .
ఆర్ధిక పరం గా చూస్తే రైతుకి లాభమే కనబడు తుంది .
కానీ,వారికి, వ్రుత్తి మార్చు కోవలసిన ఇబ్బంది ఉంది .
అలాగే రాష్ట్రానికి కూడా, ఏటికేడు అన్నపూర్ణ లాంటి పంట లిచ్చే నేల పోతుంది .
కానీ తప్పని పరిస్థితి ....
మన రాజధాని ని వేరే ఎక్కడైనా ని స్సార మైన భూముల్లో పెట్టు కోవచ్చు గదా అని కొంత మంది
అభిప్రాయాలు చెబుతున్నారు .
కానీ ,- నీటి లభ్యత , వనరుల అందుబాటు , మానవ వనరుల  ఆవాసాలకు ,
పునరావాసానికి దగ్గరలో రెడీ గా ఉన్న 4 నగరాలు ,రైలు ,రోడ్ , విమాన వనరులు -ఇవన్నీ అలోచించి తీసుకొన్న నిర్ణ యాన్ని అందరం గౌరవిద్దాం ..
 రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకిత మవ్వుదాం .... 

Comments