Skip to main content

పారబోసి ఎత్తుకోవడం అంటే ఇదే !

స్వాతంత్రం వచ్చిన తర్వాత ,గత 60 ఏళ్లలో , సుమారు 30లక్షల కోట్ల ధనం  మనదేశం నుండి విదేశీ బాంక్ లకు తరలి పోయింది . అదే డబ్బు పార్టిసి పేటరీ ' నోట్ల ద్వారా ,బంగారం రూపంలో మళ్ళీ  తిరిగి మన దేశానికి పెట్టుబడుల రూపం లోనో లేదా హవాలా ద్వారానో వచ్చి సమాంతర ఆర్ధిక వ్యవస్థ ను పెంచుతుంది . ద్రవ్యోల్పణం ,ధరల పెరుగుదల ,పేదవారు  మరింతగా ఆకలి కోరలకు చిక్కి పోవడం ,దానితో ఎక్కువశాతం యువత నక్సలిజం ,ఉగ్రవాదం వైపు ఆకర్షింప బడటం .... వీళ్ళను కంట్రోల్ చేయడానికి కోట్లాది బడ్జెట్ తో పోలీస్ వ్యవస్థ...  ఇది ఓ మహా విషవలయం. 

మన దేశ కోస్తా తీరం లో ఉన్న 80 జిల్లాలలోని సుమారు 130 పట్టణాలు ,వాటిలో ఉత్పన్న మౌతున్న  పారిశ్రామిక వ్యర్ధాలు ,తీరం వెంబడి ఉన్న మడ , సర్వీ వనాలను చిధ్రం చేసి చేపల చెరువులు ,రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టేసి ప్రక్రుతి సిద్దమైన తీర రక్షణ వ్యవస్థని పాడు చేయడం తో తుఫాన్ ల పాలబడి ఎంతో  ప్రాణ ,ధన నష్టం జరుగుతుంది. తుఫాన్ నష్టాన్ని పూడ్చడానికి మళ్ళీ రాష్ట్ర సాయం ,కేంద్ర సాయం అంటూ వేలాది కోట్లు దళారుల పాలుచేయడం .... ఇదో పెద్ద వలయం  .

సుమారు కోటి బారేల్స్ ఆల్కహాల్,కోటి టన్నుల గుట్కా ,కోట్ల పాకెట్ల సిగరెట్ ,బీడీ ల  వ్యాపారం ద్వారా అటు ప్రభుత్వమూ ,ఇటు వ్యాపారులూ డబ్బు పోగేసు కొంటున్నారు . ప్రభుత్వం మళ్ళీ అదే డబ్బుకి మరి కొంత జోడించి , ఆల్కహాల్ ,గుట్కా ,బీడీ బాధితుల ఆరోగ్య రక్షణకు హాస్పిటల్స్ ,మందులు నడుపుతుంది . ఉన్న  హాస్పిటల్స్ లో స్వచ్చత ఉండదు . పరికరాల బాగుచేయా లంటే నిదు లుండవు . నిదులున్నా మనకున్న రెడ్ టేపిజం  తో అవసరానికి నిధులు అందవ్ . మళ్ళీ కొత్త హాస్పిటల్స్ పెడతామని ప్రకటనలు గుప్పిస్తారు . ఉన్న డాక్టర్స్ కి ఉద్యోగాలు లేవు . సరైన జీతాలు ఇచ్చే నిధులు ఉండవు . మళ్ళీ కొత్త డాక్టర్స్ ని తయారు చేస్తాం అంటూ సీట్లమ్ము కొనే కాలేజీలు తెరిపిస్తారు . తిక్క రేగితే వైద్యం చేయడానికి  MBBS డాక్టర్స్ అక్కర లేదు ,ఏ B.Sc వాళ్ళతో పని కానిచ్చేద్దాం అనే తుగ్లక్ చేష్ట లకు తెర తీస్తారు .


 కాల్వల పూడికలు ,మట్టిపనులు , డ్రైన్  ల రిపేర్ ల పేరు తో అటు కాంట్రాక్టర్ లు ,దళారీలు ,అవినీతి అధికారుల ను బాగు చేసే స్కీం లు కో కొల్లలు . రోడ్లు బాగు చేయడం లో క్వాలిటీ కంట్రోల్ ఉండదు . ట్రామా తో లక్షలాది జనం చస్తూ ఉంటే ఏదో కొంత ముట్ట చెప్పి జబ్బలు చరచు కొంటారు .

రైతుకి క్వాలిటీ విత్తనాలు దొరకవు .అమ్ముకోవడానికి సవా లక్ష పెర్మిట్లు . సరైన ధర అటు ప్రభుత్వమూ ఇవ్వదు .  పరిశ్రమలకు లాభం పెంచడానికి పురుగు మందులు, కెమికల్ ఎరువులను ఎక్కువగా తయారు చేయించి భూమిని, రైతు ని గుల్ల చేసేసి ,మళ్ళీ ఆ రైతు కే పంట భీమా ,ఆరోగ్య భీమా అని కళ్ళు తుడుస్తారు .
మనమూ , మన నాయకులు మారాలి .

Comments