Skip to main content

ప్రెస్ నోట్

                                              హుదుద్ తుఫాన్ భీభత్సానికి ఎదురొడ్డి నిలిచిన ఉత్తరాంధ్ర వాసులకు అభినందనలు .

తుఫాన్ లను  ఎదుర్కొని ప్రాణ నష్టాన్ని , ప్రజల వెతలను ఎలా తగ్గించ వచ్చో చేసి చూపించిన
 ముఖ్య మంత్రి చంద్రబాబు గారికి నమస్సులు .

లాబ్స్ లోనే మగ్గిపోతున్న సాంకేతికతను ప్రజోపయోగాలకు , విపత్తు నివారణకు
ఉపయోగించు కొన్న తీరు అమోఘం .

సామాజిక బాధ్యత తో మా వంతు సాయం గా ఆరోగ్య సేవల పరం గా ఎలాంటి సాయ మైనా
అందించడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ -ఆంధ్ర శాఖ(IMA-A.P.State)
సిద్దం గా ఉందని విన్నవిం చు కొంటున్నాము .

ఉత్తరాంధ్ర లో ని  సుమారు 20 ఐ.ఎమ్.ఎ శాఖల లో ఉన్న వివిధ రకాల వైద్య నిపుణులు ఆయా
 జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నేతృత్వం లో పనిచేయడానికి సిద్దం గా ఉన్నారు .

డయేరియా మొదలగు అంటు వ్యాధుల నివారణకు ,చికిత్సలకు కావలసిన సాయం ఆరోగ్య శిబిరాల ద్వారా మరియు మొబైల్ క్లినిక్ ల ద్వారా అందించడానికి మేము సిద్దం గా ఉన్నాము .

డా . వెంకటేశ్వర్లు                డా . శ్రీనివాస రాజు                  డా . ఎన్. అప్పా రావు .  
ఆంధ్ర రాష్ట్ర IMA అధ్యక్షులు    చైర్మన్- రాష్ట్ర హాస్పిటల్ బోర్డ్      చైర్మన్ -IMA national leaders forum 

Comments