Skip to main content

భయ మేస్తుంది .............

మీడియా , కుహనా ప్రజానాయకులు,రౌడీలు -ప్రతి చావుకి డాక్టర్స్ నే బలి పశువు ను చేస్తున్నారు .  
ప్రతి చావుకి డాక్టర్స్ ని టార్గెట్ చేస్తూ అటు కొన్ని మీడియా వర్గాలు, ఇటు కొంతమంది రౌడీ ముటాలు
వైద్యులపై చేస్తున్న దౌర్జన్యాలు రోజు రోజుకీ మితిమీరి పోతున్నాయి .
అత్యవసర స్థితిలో ఉన్న రోగులకు వైద్యం చేయా లంటే నే భయ పడి  పోయే దారుణ మైన స్థితి
నేటి  మన సమాజం లో ఉంది .
డాక్టర్స్త వలన గానీ ,వైద్య సిబ్బంది వలన గానీ ఏదైనా తప్పు జరిగిందని అనుమానము న్నప్పుడు ,
ఆయా  ప్పొప్పులు నిర్ణ యించ డానికి  కోర్టులు, వినియోగదారుల చట్టం ,మెడికల్ కౌన్సిల్ -ఇన్ని ఉన్నా ,
వాటన్నింటి నీ  బేఖాతరు చేస్తూ  చట్టాన్ని  తమ చేతిలోకి తీసు కొనే రౌడీ మూకల దుర్మార్గాన్ని ఖండించి అదుపు చేసే యంత్రాంగం మనకు లేనప్పుడు డాక్టర్స్ వారి వృత్తిని ఎలా నిర్వ హించాలి ?
భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపు కొనే కొంతమంది కుహనా నాయకులు
వైద్యులను బెదిరించో , దౌర్జన్యం చేసో , టెంట్ లు వేసి బద్నామ్ చేస్తా మని బ్లాక్మెయిల్ చేసో
వైద్యుల కు వైద్య వ్రుత్తి పై విరక్తి కలిగే టట్లు చేస్తున్నారు .
కొన్ని చానళ్ళు, వైద్య సేవ అంటే అదొక భయానక దోపిడీ వ్రుత్తి అనే ముద్ర వేసేసి ,  ప్రజలను
 పూర్తిగా తప్పుదారి పట్టిస్తు న్నాయి .
వైద్యం అంటే పది రకాల సేవలు ,వివిధ సంభావ్యతాలు , మందు పనిచేసే విధానం ,రోగి సహకారం - ఇవన్నీ సరైన నిష్పత్తి లో చక్కగా అమిరితే నే కేసు విజయ వంత మవుతుంది . 

చాల మంది పోలీస్ లకు ముఖ్యం గా కింది స్థాయిలోని వారికి కొత్త గా వచ్చిన  చట్టాలు ,న్యాయ స్థానాలు ఇచ్చే తీర్పుల పై అవగాహన ఉండదు . ఇంకా పాత సెక్షన్ ల కింద అరెస్ట్ చేయడానికి రెడీ అవుతారు . 
మీడియా ,పబ్లిక్ గొడవ చేస్తున్నారు ,కాబట్టి ఏదో ఒక సెక్షన్ కింద డాక్టర్ ని అరెస్ట్ చేయాలని సమాధానం చెప్పి సమర్ధించు కొంటారు . 
ఇలాంటి దౌర్భాగ్య స్థితి లో ఉన్న వైద్య సేవా వృత్తిని ,వైద్యులను IMA ఎలా రక్షించాలి ?
అప్పుడు IMA  నాయకులు,  పోలీస్ అధికారులను కలిసి సెక్షన్ 80 లేదా 87  లేదా 88 లేదా 174
కింద మాత్రమే కేసు నమోదు అయ్యే టట్లు గా చూడాలి . 
section 80 ---- accident in doing lawful act.
section 87----- act not intended to cause death/grievous injury,done by consent.
section 88------ act not intended to cause death done by consent in good faith for patient's benefit.
section 174----  for suspicious death. 

సరైన మెడికల్ రిపోర్ట్ లేకుండా డాక్టర్స్ ని ఏ పోలీసు  లేదా కోర్టు అరెస్ట్ చేయ కూడదు . 
మెడికల్ రిపోర్ట్ లో డాక్టర్ నిర్లక్ష్యం(negligence) వలన రోగి మృతి చెందాడని తేలితే ,అప్పుడు మాత్రమే 304-A సెక్షన్ కింద కేస్ నమోదు చేయాలి .  
మెడికల్ రిపోర్ట్ లేకుండా 304-A కింద అరెస్ట్ చేసినా ,కేసు నమోదు చేసినా ,ఆ పోలీస్ అధికారుల పై కోర్టు ఉల్లంఘన కింద కేసు పెట్టాలి . 
అంతే కాదు , డాక్టర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 304 కింద అరెస్ట్ చేయ కూడదు ,కేస్ నమోదు చేయకూడదు . 
మెడికల్ కమిటీ విధి ఏమిటి ?
పొరబాటు(medical error) ,నిర్లక్ష్యం(negligence) ,ప్రమాదం(accident) -ఇవన్నీ వేర్వేరు  విషయాలు . 
వీటిని తేల్చే బాధ్యత మెడికల్ కమిటీది . 

సరే ,డాక్టర్స్ ఏం చేయాలి ?
ఏదైనా సంఘటన జరిగినప్పుడు - రోగి మర ణించినా ,దాడి జరిగినా , డాక్టర్స్ సాధ్య మైనంత త్వరగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి . 
రోగులకు - ఔట్ పేషంట్ లేదా ఇన్ పేషంట్ -అందరికీ కూడా ఏవైతే మందులు,పరీక్షలు ,సేవలు ఇచ్చామో - వాట న్నింటి నీ సరిగా నమోదు చేయాలి .  
వైద్యానికి ముందే ,అనుమతి సంతకం(informed consent) తీసుకోవాలి . 
వైద్య విధానం లోని సాధక బాధలు చక్కగా అర్ధ మయ్యె టట్లు తరచుగా చెప్పాలి(counseling) . 

Comments