గుండె కి స్టంట్ ,పేస్ మేకర్ ,కృతిమ కీళ్ళు ,ఎముకలకు టైటానియం ప్లేట్లు -ఇవి అమర్చాలంటే రోగులకు తడిసి మోపిడవుతుమ్ది . దీనికి కారణం మధ్యలో ఉన్న దళారులు .
బియ్యం,పంచదార ,పప్పులు కొనాలంటే చేయి కాలుతుంది,జేబు ఖాళీ అవుతుంది . దీనికి కారణం మధ్యలో ఉన్న దళారులు .
పండించడానికి గానీ , వస్తువు తయారీకి గానీ 10 రూపాయ లైతే వినియోగదారుడికి 100 కి అమ్మే వ్యవస్థని నియమ నిరోధం చేయక పోతే సంపద ఎంతగా సృష్టించినా అసమానతలు పోవు .
అటు కష్టించే తయారీ దారుడు ,ఇటు వినియోగ దారుడు నష్ట పోతారు . మధ్యలో ఎలాంటి రిస్క్ గానీ,కష్టం గానీ లేని దళారులు బలిసిపోతారు .
హాస్పిటల్స్ కి వచ్చే లాభాలలో అత్యధిక శాతం (40% ) మెడికల్ పరికరాలు ,మందుల అమ్మకం ద్వారానే వస్తుందనేది అందరికీ తెలుసు . అలాగే రోగులకి అయ్యే వైద్య ఖర్చులో 70% వీటికే అవుతుందని ప్రభుత్వానికి ఎరికే .
ఉదాహరణకి , తయారీదారుడు అమ్మే స్టంట్ ధర 10000/-. దీనిని దళారీ(stockist/distributor) 30000/- కి హాస్పిటల్ కి అమ్ముతాడు . హాస్పిటల్ వాళ్ళు ఈ స్టంట్ ని రోగికి 70000/- కి అమ్ముతున్నారు .
ఒక కేజీ పంచదార కి సరిపోయే చెరకు ని పండించ డా నికి రైతు కి 5/-ఖర్చు అవుతే , ఆ చెరకుని పంచదారగా మార్చడానికి మిల్లు వారికి మరో 5/- ఖర్చు అవుతుంటే ,సంతలో దానిని 50/- కి అమ్మే దుస్థితి ఉంది .
సెల్ ఫోన్ బిల్లింగ్ ధరలను,మందుల ధరలను మనం నియంత్రిస్తున్నప్పుడు ,మెడికల్ పరికరాల ధరలను ప్రభుత్వం ఎందుకు నియంత్రించ దు ?
ఆరోగ్య భీమా కంపెనీలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో వైద్యం చేయించు కొంటేనే భీమా పరిహారం ఇస్తాయి . అదే క్వాలిటీ వైద్యం అత్యంత తక్కువ ఖర్చులో చిన్న హాస్పిటల్స్ లో చేయించు కోవడానికి ఆరోగ్య భీమా కంపెనీలు ఎందుకు ఒప్పుకోవు ?
కాన్సర్,గుండె జబ్బుల వంటి వాటికి (tertiary care)కాకుండా ,అప్పెండిక్స్ ,హెర్నియా ,వరిబీజం ,ఎముకల సెట్టింగ్ ,గర్భసంచి శస్త్ర చికిత్సలు వంటి చికిత్సా విధానాలకు (సెకండరీ కేర్) చిన్న హాస్పిటల్స్ లో 25000/-ఖర్చు ఐతే పెద్ద హాస్పిటల్స్ లో వీటికే 1లక్ష అవుతుంది . ఆరోగ్య భీమా కంపెనీలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనే వైద్యానికి అనుమతి ఇవ్వడం వలన రోగి ఎక్కువ ప్రీమియం చెల్లించ వలసి వస్తుంది .
ఆరోగ్య భీమా కంపెనీలు హాస్పిటల్స్ ని వర్గీకరించి(depending on amenities,bed strength and locality) అటు పెద్ద ఇటు చిన్న హాస్పిటల్స్ లలో వైద్యానికి అనుమతులు ఇచ్చి ,హాస్పిటల్ కేట గిరీ ప్రకారం భీమా ప్రీమియం ని వసూలు చేయాలి . అప్పుడే రోగికి రెండు రకాల హాస్పిటల్స్ ని ఎన్నుకొనే స్వేచ్చ ఉంటుంది .
మన దేశం లో రోగులకు అందుబాటులో ,అతిదగ్గరలో ఉండే వి చిన్న హాస్పిటల్స్ . వాటిని బతికించు కోవలసిన అవసరం అందరికీ ఉంది .
ఏ మార్కెట్లో అయినా అటు తయారీ దారుడు , ఇటు వినియోగ దారుడు నష్ట పోకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే .

Comments
Post a Comment