Skip to main content

ఋణ మాఫీ - రైతు సాఫీ

ప్రపంచంలో మూడింట రెండు వంతుల పేదలు గ్రామాలలోనే ఉన్నారు.
కారణం  వ్యవసాయం లాభసాటి గా లేదు.  పండించే  పంటకి రేటు నిర్ణయించు కొనే స్వేచ్చ రైతుకి లేదు.
పంటని 10 రూపాయలకు కొని వినియోగదారులకు 100 రూపాయల కి అమ్మే  దళారీ దోపిడీ పద్దతులను ప్రభుత్వం ప్రోత్స హిస్తుంది.
రోజుకి 75రూపాయలతో జీవితాలను వెళ్ళ బుచ్చే వారిని పేద వారని ప్రపంచ ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు . మన దేశం లో అలాంటోళ్ళు సుమారు 30కోట్ల మంది ఉన్నారు .

సీమాంధ్ర లోని 13 జిల్లాలలో 85 లక్షల మంది రైతుల (ఇందులో 72 లక్షల మంది  సన్నకారు రైతులు.) వ్యవసాయ రుణ పద్దు మొత్తం లెక్క వేస్తే సుమారు 60000కొట్లు ఉంది.పంట రుణాలు,దీర్ఘ కాలిక వ్యవసాయ రుణాలు,ఇంకా పాడి గేదలకోసం,కోళ్ళు,జీవాల పెంపకం కోసం చేసిన రుణాలు అన్నీ ఈ పద్దులో ఉన్నాయి.
కేవలం పంట రుణాలు మాత్రమే లెక్క వేస్తే అది 34000కోట్లు.
డ్వాక్రా రుణాలు మొత్తం 14000 కోట్లు తేలింది .

అటు చూస్తే మన రాష్ట్రానికి సంబంధించి బాంక్ ల ఆర్ధిక పరిస్థితి కూడా బాగోలేదు. ఇటు చూస్తే ఇప్పటికే మన కొత్త రాష్ట్ర ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి 16000కోట్ల లోటు తో మొదలైంది .

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేసే సాయం  ఎక్కడా వ్రుధా పోకుండా,అపాత్రులకు చెంద కుండా ఉండాలి.
1. ఆదాయ పన్ను కట్టే వారిని మినహాయించి కేవలం సన్నకారు రైతులు,కౌలు రైతుల,డ్వాక్రా మహిళా గ్రూపు  రుణాలు మాఫీ చేయాలి. అంటే వ్యవసాయం తప్ప మరే ఇతర ఆదాయం లేని వారికి మాత్రమే రుణమాఫీ వర్తింప చేయాలి.
సన్నకారు రైతు అంటే ఎవరు? కౌలు రైతు అంటే ఎవరు? వీరిని ఎలా గుర్తించాలి?  ఇవన్నీ ప్రభుత్వానికి బాగా తెలిసిన విషయాలే . మీడియా వారు కూడా సహకరించాలి .

ఏది ఏమైనా రైతు తన కాళ్ళ పై నిల బడే టట్లు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే .
గ్రామాల్లోనే విత్తన శుద్ది బాంక్ లు , రైతుకి పంట ని అమ్ముకొనే స్వేచ్చ ,మద్దతు ధర , మంచి విద్యుత్ సరఫరా ఇవన్నీ ఏర్పాటు చేయ వలసిన పెను బాధ్యత ప్రభుత్వానిదే .


Comments