Skip to main content

దక్షిణ భారతం లో కొత్త మెడికల్ కాలేజీలు వద్దు

మన దేశం లో ప్రస్తుతం 6 లక్షల డాక్టర్స్ , 16 లక్షల నర్సులు , 9 లక్షల హాస్పిటల్ మంచాలు ఉన్నాయి .
మనకున్న లోటు ఏమిటయ్యా అంటే , ఉన్న వనరులన్నీ పట్టణ ప్రాంతాలలో నే పోగుపడి పోయి , పల్లెలు బిక్క చచ్చి ఉన్నాయి . పల్లెలలో హాస్పిటల్స్ నెలకొల్పడానికి పూర్తీ రాయితీ తో అప్పులు , వివిధ పన్నులలో వెసులుబాటు, ఇతర ఆర్ధిక సహాయం ,ప్రభుత్వం కల్పించాలి .  అంతే కానీ , వందలాది మెడికల్ కాలేజీలు ,లక్షలాది డాక్టర్స్  అవసరం లేదు .
 ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది,   యునెస్కో చెప్పింది ,అది చెప్పింది ఇది చెప్పింది అని ఎప్పుడో బూజు పట్టిన లెక్కలు వల్లించి లక్షలాది ఆరోగ్య రంగ నిపుణులు కావాలని ప్రజలను తప్పు దారి పట్టించ నక్కర లేదు .
పల్లెలలో , ఎలాంటి సాంకేతిక వనరులు లేకపోయినా సమర్ధ వంత  మైన వైద్యం అందించ గల నిపుణులను తయారు చేయాలి . మొబైల్ వ్యవస్థని పూర్తిగా ఉపయోగించే ఏర్పాట్లు చేయాలి .   టెలి వైద్యం, హెల్త్ ఆన్ వీల్స్ ,లాబ్ ఆన్ చిప్ లాంటి సాంకేతికత తో దూర ప్రాంతం లోని ప్రజా బాహుళ్యానికి కూడా సకాలం లో సరైన వైద్యం అందించ వచ్చు .
MBBS డాక్టర్స్ కి సరైన ఉద్యోగం లేక కుంగి కునారిల్లుతు ఉంటే ఇంకా వేలాది డాక్టర్స్ తయారు చేసే ప్రభుత్వ పధకాలు దేశానికి చేటు .

Comments