Skip to main content

Doctors must respond to the needs of people... in a better & affordable way

కూలీలను భరించే స్థోమత లేని వాళ్ళు మడి కి నీరు పెట్టాలన్నా ,పొలంలో పెరిగిన కలుపును తీయాలన్నా  ఏం చేయాలి ?
గ్రామాలలో కరెంట్ కట కట లున్న చోట విద్యుత్తు, బొగ్గు సహాయంతో చేసే ఇస్త్రీ కంటే అత్యంత చౌకగా ఇస్త్రీ ఎలా చేయాలి?
వీటికి పరిష్కారం ఏ అమెరికా లేదా ఐ. ఐ .టి  శాస్త్రజ్ఞుడో  కనుక్కోలేదు . గ్రామాల్లో ఉండి  బైకులు బాగు చేసే మెకానిక్,ఇత్తడి గిన్నెలు బాగు చేసే కంచరి కనుక్కొన్నారు. 
"బైక్ హ్యాండిల్, ఆరు బేరింగులు, క్లచ్ లివర్, బెల్టు, పుల్లీ, అయిదు నాగళ్లు, పలుగు పరికరాలతో కలుపుతీసే యంత్రాన్ని తయారు చేశారు. ఈ యంత్రానికి 4 హెచ్‌పి డీజిల్ ఇంజన్‌ను అమర్చి ఎడమ చేతితో ఆపరేట్ చేసేలా యాక్సలరేటర్ అమర్చారు. 1.5 లీటరు డీజిల్‌తో కేవలం మూడున్నర గంటల్లో ఒక హెక్టారు పొలంలో కలుపు తీయవచ్చంటారు పరకాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన మహిపాల్‌చారి". 

"గ్యాస్ సహాయంతో ఐరన్ బాక్సు లోపల అమర్చిన అలాయ్ త్వరగా వేడెక్కుతుంది. కేవలం 10 గ్రాముల గ్యాస్‌తో గంటసేపు నిరంతరాయంగా దుస్తులు ఇస్త్రీ చేయవచ్చని తాను రూపొందించిన గ్యాస్ ఐరన్ బాక్సుతో నిర్ధారించాడు లింగ బ్రహ్మం అనే నరసం పేట యువకుడు" .

మరి మన డాక్టర్స్ వైద్య పరం గా ఇలాంటి సులువు పద్దతులు ఎందుకు కనిపెట్ట లేక పోతున్నారు ? 
గ్రామా లలో కరెంటు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నప్పుడు రక్త నిధిని,కొన్ని రకాల మందులను, టీకాలను ఎలా కాపాడుకోవాలి? 
 రోగ నిర్ధారణ,చికిత్స లలో వాడే పరికరాలను,డిస్పోసబుల్స్ ని అతి చౌకగా ఎలా తయార్ చేయాలి?
 గర్భిణీ ల గుమ్మానికి మొబైల్  స్కానింగ్ పరీక్షని ఎలా తెసుకెళ్ళాలి?
అత్యంత చౌకగా రక్త పోటు,షుగర్ వ్యాదులను గ్రామ స్థాయి లో ఎలా కనుక్కోవాలి?
ఆసుపత్రి లో కాన్పు  కన్నా ఇంటి వద్దకే డె లీవ రి సౌకర్యాన్ని ఎలా ఏర్పాటు చేయాలి?
బడిలో,కాలేజీలలో విద్యార్ధుల కంటి చూపు,వినికిడి పరీక్షలు అతి సులువుగా ఏ విధం గా చేయాలి?

Comments