Skip to main content

అతిపెద్ద నిరక్షరాస్య అమాయక భారత దేశం ...

జనం తమ ఓటు పవర్ ని పూర్తిగా నమ్మడం లేదు.
 అందుకే ఓటు కి వందో,వెయ్యో పుచ్చుకొని ఎలక్షన్ రోజుని  ఓ పండుగ లా చూస్తున్నారు తప్ప, అది ఒక అత్యంత భాద్యతాయుతమైన పనిగా భావించడం లేదు.
నిరక్షరాస్యులు సుమారు 50కోట్ల మంది ఉన్న మన దేశం లో ఓటు అర్హత ఉన్న 76 కోట్ల మందిలో   కేవలం 50శాతం పోలింగ్ కి వచ్చి ఓటు వేసే వారివలనే దేశ భవితవ్యం నిర్ణయింప బడుతుంది.

ఎలాంటి పాలనా అర్హత లేకపోయినా,సిం హ భాగం కుల మత సమీకరణాలతో మనం నాయకులను ఎన్నుకొంటున్నాం. ఆ తర్వాత వారు తప్పులు చేస్తున్నారని వాపోతున్నాం.

అభ్యర్ధులందరూ  కొద్దో గొప్పో ఒకే రకమైన వారు.ఎవరు ఓటు కి ఎక్కువ డబ్బులిస్తే వారికే వేద్దాం.
ఆ..మన ఒక్క ఓటు దేశ తలరాతని మార్చుద్దా?ఎవడెళ్తాడు ఆ పోలింగ్ బూత్ కి?
మన కులపోడు నిలబడ్డాడ్రా .పద పద...
మనోడేరా.మనతో కలిసి ప్రార్ధనలు చేయిస్తాడు.
ఒసేయ్ ... మన సంఘానికి వడ్డీ లేకుండా అప్పులిప్పిచ్చాడ్రా..
అరేయ్..మన అప్పులు మాఫీ చేశాడొరేయ్ ...
ఎహే ...మనం పనిచేయకపోయినా మస్తర్ వేయించుకొంటే చాలు..డబ్బులిస్తున్నార్రా  ...
ఆళ్ళు స్కూళ్ళల్లో బువ్వెడత నారు.
కొంపా గోడు  ఇచ్చారు.కొలువిచ్చారు..పిల్లకి చదువిచ్చారు
తేరగా డబ్బులిచ్చే వాళ్ళు,అప్పులు ఇప్పించే వాళ్ళు,ఏదైనా సరే ఫ్రీ గా  ఇచ్చేషోళ్ళను గెలిపిద్దాం...సరేనా...
తమ ఓటు దేశ భవిష్యత్ ని మారుస్తుందని ఇక్కడెవరూ గాడం గా నమ్మడం లేదు

Comments