Skip to main content

బలమైన ప్రభుత్వమ్ కావా లంటే ప్రతి ఓక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలి .

1. వాస్తవానికి అగ్ని-5 వంటివి భారీ జనహనన ఆయుధాలు. కానీ ఇలాంటి ఆయుధాల తయారీని ఒక విజయంగానే మెజారిటీ భారతీయులు భావిస్తున్నారు. హిరోషిమా, నాగసాకి విధ్వంసాల తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా అణు క్షిపణుల పరిధి, వాటి సంఖ్య నానాటికీ పెరగడమే తప్ప తగ్గడం లేదు.
ఎందు కంటే, ఆత్మ రక్షణ అనేది యుద్దానికి  నువ్వెంత తయారుగా ఉన్నావనే దాని పై ఆధారపడి ఉంటుంది
2. తమ దేశం లో పెరుగుతున్న ఆర్ధిక మాంద్యానికి విరుగుడు  గా ఫెడరల్ బాంక్, రుణాల పై వడ్డీ రేట్లను బాగా తగ్గించింది . అమెరికా ఫెడరల్ ప్రభుత్వ రుణాలు 2005-12 సంవత్సరాల మధ్య 5.3 ట్రిలియన్ ( 1 ట్రిలియన్ అంటే లక్ష) డాలర్ల మేరకు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు తీసుకున్న రుణాలు వీటికి అదనం. మొత్తం మీద ఆ నాలుగేళ్ళలో అమెరికా మొత్తం రుణాలు 10 ట్రిలియన్ డాలర్ల మేరకు పెరిగాయి. మరి ఆ దేశ స్థూల దేశియోత్పత్తి ( జిడిపి) మాత్రం కేవలం 1.5 ట్రిలియన్ డాలర్ల మేరకు మాత్రమే పెరిగింది . 
అంటే రుణంగా తీసుకున్న ప్రతి ఒక్క డాలరు కేవలం 15 సెంట్స్ ఆదాయాన్ని మాత్రమే సమకూర్చింది. 
ఎందుకని?
 తీసుకున్న రుణంలో చాలా స్వల్ప భాగాన్ని మాత్రమే ఉత్పాదక కార్యకలాపాలకు వినియోగించడమే. 
అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొని , రుణాలను తిరిగి చెల్లించగలిగే విధంగా అమెరికా ఆ రుణాలను వినియోగించడం లేదు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ సంక్షోభంలో పడిపోయే అవకాశం ఎంతైనా ఉన్నది. విదేశీ మదుపుదార్లు మన మార్కెట్ల వైపు బారులు తీరుతారు. మనం చేయవలసిందల్లా మన పరిపాలనా వ్యవస్థను పటిష్ఠం చేసుకోవడం.
 సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వ సొమ్మును పంపిణీ చేసి ఓటర్లకుగాలం వేస్తున్నారు . అందుకే ఎన్నికల సంఘానికి  మేనిఫెస్టోలపై నియంత్రణ ఉండాలి . ఇంకా పాత (1951లో వచ్చిన) చట్టం ప్రకారం ప్రస్తుత హామీలు, మేనిఫెస్టోలపై ఎన్నికల సంఘం ఏమీ చేయలేకపోతోంది .  


Comments