Skip to main content

ఇదీ నేటి భారతం ...

 మనస్సుకి మోహనం కలిగిస్తుంది అనుకొన్న ఒక రోబోట్  మన కర్మ కాలి సరిగ్గా పనిచెయ లేదు .
త్యాగమయి గా పేరేల్లిన ఒక మహిళ అంత త్యాగమూర్తి కాదని,మత దురభిమానం,మంకు పట్టు మరీ ఎక్కువున్న మామూలు అబలేనని తేలి పోయిన్ది.
ఇక మంత్రాంగం లో మిగిలిన 60 మంది, నట్టువాంగం కి మాత్రమే పనికొస్తారని తెలిసోచ్చింది .
ఇవన్నీ తెలిసే సరికి మన కొంప కొల్లేరయ్యింది .
రూపాయి పాయె .
రూకలు చిల్ల పెంకులాయే .
ద్రవ్యోల్పణమ్ సరే ... ద్రవ్య లోటు
 గత దశాబ్ద కాలంలో 7.7 శాతం సగటు వృద్ధి రేటును చవిచూసిన ఆర్థిక రంగం ఇప్పుడు కేవలం 4.4 శాతం వృద్ధి రేటుకు పరిమితమైం ది . 
అమెరికాలో  వడ్డీ రేట్ల పెరిగితే మన స్టాక్ ల్లో దాచుకొన్న డబ్బుని ఊడ్చి పట్టుకు పోతున్నారు . 
 నిర్మాణం, ఉత్పత్తుల రంగంలో ఉద్యోగాలు గల్లంతవుతున్నాయి . 
 పెరుగుతున్న ఆహార ఉత్పత్తుల ధరలతో బతుకులు దుర్బరంగా మారాయి . 
 నేరుగా సబ్సిడీలు అందజేయాలన్న ఒక్క మంచి నిర్ణయం తప్ప ( పేదలకు అందాల్సిన సబ్సిడీల్లో 60 శాతం అవినీతి అధికార గణం నొక్కేసేది) మరే ఇతర సంస్కరణ చేయ లేదు . 

అవినీతి, అనుమతులకు నోచుకోని   భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు , 
సబ్సి డీ లతో నిరర్థక వ్యయం 
 అట కెక్కిన విద్య, కార్మిక విధానాల్లో సంస్కరణలు.   - వీటన్నిన్టి   వల్ల బడ్జెట్ లోటు. 
సగటు భారతీయుడి జీవితం లో పూడ్చ లేని అగాధం . ఇదీ నేటి భారతం   

Comments