Skip to main content

యుద్ధం చేద్దాం రండి .

    మన ప్రభుత్వ విధానా లు మనకు శాపాలు .

  మన ప్రజల అలవాట్లు మన రూపాయికి అగచాట్లు . 

ఇనుప ఖనిజం, బొగ్గు, యంత్రపరికరాల వంటివి నివారించ దగ్గ దిగుమతులే.  ఈ మూడు విభాగాలను మనం సమర్థవంతంగా అభివృద్ధి చేసినట్టయితే పెద్ద మొత్తంలో విదేశీ మారకం ఆదా అయి ఉండేది. రూపాయికి ఈ దుస్థితి పట్టేది కాదు.
అనవసర దిగుమతులు మనకు గుది  బండలు:
విలాస వస్తువులు - యాపిల్స్ , లిక్కర్, ఆట బొమ్మలు, కాస్మోటిక్స్, చాక్లెట్లు, కళ్లద్దాలు, ఇళ్లకు వేసే తాళాలు, గడియారాలు, శరీరానికి పూసుకునే సుగంధ ద్రవ్యాలు, డిజిటల్ కెమెరాలు, సిల్క్, కార్లు, మొబైల్స్క, కలర్‌టీవీలు. వీటి దిగుమతి  వల్ల మన విదేశీ మారకం నిల్వలు తరిగిపోవడమే కాదు...దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుంగిపోతున్నాయి. ఈ ధాటికి మన దేశంలోని బాత్‌రూమ్ ఫిటింగ్స్, పెన్నుల పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 
మనకు చాలా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. భయం లేదు . 
తప్పు. మనకున్న 28000 కోట్ల డాలర్ల విదేశీ మారకం నిల్వల లో 14000  కోట్ల డాలర్లు  విదేశీయుల మదుపే .
ఉన్న ఆ కాస్త నిల్వలు 3నెలల ఆయిల్ దిగుమతులకు సరిపోవు . 
ఇప్పుడు మన మేం చేయాలి ? 
పైన చెప్పుకొన్న వస్తువులను వాడ కూడదు . 
ఆయిల్ ,వంట నూనె లు మితంగా వాడాలి . 
ఆర్ధిక క్రమ శిక్షణ ప్రజలకు అత్యవసరం .
 ఇప్పటి వరకు నిరుద్యోగం,అవినీతి , ఉగ్ర వాదం పై పోరాడుతున్న మనం ద్రవ్యోల్పణం, కరెన్సీ లోటు ,
పనికిరాని దిగుమతుల పై  యుద్ధం చేయ వలసిన సమయం వచ్చింది . .  .. 

Comments