Skip to main content

సమైఖ్య ఆంధ్ర - తెలంగాణ సంవాదం

                                                                                     సమైఖ్య ఆంధ్ర  - తెలంగాణ  సంవాదం . 
మా బతుకు మేము ఏదో విధం గా బతుకుతామ్. మమ్మల్ని వదిలితే మీకూ, మాకూ మంచిది. 
ఎలా ,ఎక్కడికి, ఎందుకు  వెళ్ళాలి ? అంతగా కలిసి ఉండ లేక పోతే మీరే వెళ్ళ వచ్చు గదా ? 

మేమెందుకు వెళతాం ? ఈ నే ల మాది. పొట్ట చేత పట్టుకొచ్చిన వారు మీరు. మీరే వీడి పోవాలి .
అందరమూ అలా వచ్చిన వాళ్ళమే . నే ల మీదా ? మాదా ? అనే ప్రశ్నే లేదు . ప్రజా స్వామ్యం లో రాజ్యాలు వారసత్వ సంపద కాదు . రాచరికాల , జమీన్ ల కాలాన్ని ఆధారం చేసుకొని భూభాగాలు పంచు కొనే కాలం కాదు . భార దేశం లో ని ప్రతి మట్టి బెడ్డా  ప్రతి భారత  బిడ్డకీ  చెందుతుంది . ప్రజా స్వామ్యం లో ప్రజల మనోభావాలకు ఎంత విలువ ఇవ్వాలో , అంతే విలువ రాష్ట్ర సమగ్రత ,పరిపాలనా సౌలభ్యం,వనరుల పంపిణీ కి ఇవ్వాలి .

తెలంగాణ అని చెప్పుకొనే మా  భూభాగం ఎప్పుడూ హైదరాబాద్ ప్రాంతం తో ముడి పడి ఉంది . కాబట్టి అది మాకే చెందాలి . 
వంద ఏళ్ళ క్రితం సీమాంధ్ర కూడా హైదరాబాద్ ప్రాంతం తో ముడి పడి ఉంది . అది నిర్ణయాత్మక మైన అర్హతా కాదు .మీ ప్రకారం అదే నిర్ణయాత్మక మైన అర్హత   ఐతే  హైదరాబాద్  మాది కూడ .

మా ఉద్యోగ అవకాశాలను మీరు తన్నుకు పోతున్నారు. మాకు రావలసిన నీటిని మీరే వాడేసు కొంటున్నారు . ఉద్యోగుల ప్రమోషన్ లు ,విద్యా అవకాశాలు, మేము సెపరేట్ గా ఉంటే మెరుగవు తాయి . 
గ్లోబలైజేషన్ కాలం లో మాట్లాడ వలసిన మాట కాదు . ఎవరు మెరుగ్గా రాణిస్తారో వారికే అవకాశాలు  సహజం . ఇప్పుడు మీ 9 జిల్లాల వారు మిగతా 14 జిల్లాల వారితో పోటీ పడలేక విడి పోతామనే వాదం అర్ధం లేనిది . సరే ఇప్పుడు మీ 9 జిల్లాల వారు విడిపోతారు . కొద్ది కాలంలోనే వెనకబడిన ప్రాంతా లైన మెదక్ , ఆదిలాబాద్  మొదలగు జిల్లాల వారు కూడ తక్కువ పోటీలో  మెరుగైన అవకాశాలు ఉంటాయనే    వాదం తో  విడిపొతే బాగుంటుంది అంటారు . మెరుగైన అవకాశాల కోసం ఇలా ముక్కలుగా చేసుకోవడం మంచిదేనా ?  వనరుల పంపిణీ కష్ట మ వ్వదా ? ఉగ్ర వాదం పెచ్చు మీరదా ? నీటి పంపకం క్లిష్ట మ వ్వదా ? ఆస్తులు , అప్పులు, మౌలిక సదుపాయాల  పంపిణీ తల నొప్పి కాదా ? 9కోట్ల ప్రజలను పాలించ డా నికి 25000 కోట్ల ఖర్చు అవుతుంది . కోటి మంది ని పాలించ డా నికి  అంతే ఖర్చు పె ట్టే నాయకులు అధికారులు మనకున్నారు . రాష్ట్రం చిన్నదైనా ఆ ఖర్చు తప్పదు . మౌలిక సదుపాయాల కల్పనా ఖర్చు సరే సరి . 

మీరు ఎప్పటి నుండో మమ్మల్ని దోచుకొంటున్నారు . మీతో కలిసి ఉండ లేము . గత 60 ఏళ్ళలో మీ ప్రాంతపు వారు  50 ఏళ్ళు ముఖ్య మంత్రులుగా ఉంటే ,మా ప్రాంతపు వారు 12 ఏళ్ళు మాత్రమే  పాలించారు . 
ఇది రాచరికం కాదు . చిన్న ప్రాంతమైన రాయల సీమ వారే ఎక్కువ పాలించారు . అలా అని సీమ ఏమైనా ఎక్కువ లబ్ది పొందిం దా ? ప్రజా స్వామ్యమ్  లో ఏ ప్రాంతం వారైనా రాజ్యాంగ బద్దం గా పాలించ వలసిందే . వనరుల పరంగా  అభివృద్ధి లో కొద్ది హెచ్చు తగ్గు లుంటాయి . వనరులను సమర్ధం గా పంచు కోవడ మే ప్రజా స్వామ్యానికి గీటు రాయి . చిన్న రాష్ట్రాలుగా విడిపోవడం పరిష్కారం కాదు . జబ్బొకటి , మందు వేరొకటి . 

ఎన్నో చిన్న రాష్ట్రాలు మన దేశం లో అభివృద్దిలో ఉన్నాయి గదా . అలాంటిది ఎన్నో ఏళ్ళగా పోరాటం చేస్తున్న మాకూ  ఓ రాష్ట్రం ఉండాలని కోరుకొంటే  ఇంత  వ్యతిరేకత ఎందుకు ? 
ప్రజల మనోభావాలు గౌరవింప బడాలి . అదే సమయం లో ఇతర  ప్రజా సమూహాల కు  అన్యాయం జరగా కూడదు . ఏ రాష్ట్రాని కైనా రాజధాని ప్రాంతం ఆర్ధికం గా , హార్ధికం గా  ఎంతో  ముఖ్య మైన చోదక శక్తి . 
వంద ఎకరాల లో 30 అంతస్తుల భవనాలు నాలుగు కట్టు కొంటే పరిపాలనా సౌకర్యాలు సమకూడ తాయి . కానీ , లక్షలాది కోట్ల విలువైన జిడిపి , రెవెన్యూ , ఎలా వస్తాయ్ ? అంటే , ఒక ప్రాంత ప్రజల సెంటి మెంట్ కోసం కోట్లాది ప్రజల ను ఆర్ధిక సంక్షోభం లోకి తోసేయాలా ? ఆకలి ద ప్పులకు అప్ప చెప్పాలా ?అయినా ఇన్ని మాట లెందుకు ? రాజ ధాని మీకూ కావా లంటే అందరం కలిసి ఉందాం . లేదూ ,మీకు ఓ ప్రత్యేక రాష్ట్రం కావా లంటే 9 జిల్లాల తెలంగాణ రెడీ గా ఉంది . 

అలా ఎందుకు భయ పడుతునారు ?మీకున్న వనరులతో మీరూ బాగా అభివృద్ధి చెంద  వచ్చు .  
వచ్చు . కానీ 50 ఏళ్ళు పడుతుంది . ఈ  లోపు కొన్ని తరాల ప్రజలు బ్రష్టు పట్టి పోతారు .  మీరిచ్చిన సలహా మీరు పాటించి ఒక కొత్త రాజధాని  ని నిర్మించు కోవచ్చు కదా ?
   నిజానికి,హైదరాబాద్ మీదే  మీ కన్ను . 
నిజానికి మీ కన్ను కూడా  దాని పైనే . వాస్తవానికి , ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 సంవత్సరానికి మన ఆదాయం ఒక లక్షా అరవై ఒక్క వేల కోట్లు. ఈ మొత్తాన్ని, మామూలుగా ఇప్పటివరకు పాటిస్తున్న జనాభా దామాషా(సీమాంధ్ర - 58 శాతం, తెలంగాణ - 42 శాతం)తో భాగిస్తే సీమాంధ్రకి 93.38 వేల  కోట్లు, తెలంగాణకు 67.62 వేల  కోట్లు వస్తుంది. కానీ,విడిపోతే  సీమాంధ్ర రాష్ట్రానికి 93.38 వేల  కోట్ల ఆదాయం రావడం కష్టంగానే కన్పిస్తోంది. ఎందు కంటే , ఉమ్మడి రాష్ట్ర మొత్తం  ఆదాయంలో సగానికి పైగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచే వస్తున్నది. ఒక రకం గా హైదరాబాద్ ప్రాణ వాయువే .  లెక్కల ప్రకారం హైదరాబాదు ఆదాయం అసలు లేకుండా, బహిరంగ మార్కెట్‌లో అప్పులు తెచ్చుకొనే సౌకర్యం తగ్గుతున్న నేపథ్యంలో కేంద్ర గ్రాంటులు అన్నీ వచ్చినా సరే, సీమాంధ్ర ఆదాయం 60 వేల కోట్లు దాటే పరిస్థితి కనిపించటం లేదు.
మాకు వాద వివాదాలు వద్దు . మాకు రాష్ట్రం కావాలి . 
అలాగే . 23 జిల్లాలతో ఉన్న ఈ సువిశాల రాష్ట్రం మొత్తం మీదే అని అనుకోండి  . పేరు కూ డ తెలంగాణ అని పెట్టు కోండి . 
 A  senior research fellow at the Institute of Commonwealth Studies in the University of London, said that the splitting of Andhra Pradesh was a much more significant departure from the original concept of Indian federalism.
"There is considerable potential for this kind of trend to develop, which will create a very different kind of India," he said. "Not an India based on linguistic states, but one based on a whole range of distinguishing factors - culture, region, religion."
  


Comments