Skip to main content

రాజధాని రగడ : 2 వ భాగం

 600 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం గల భూమి, 30 వేల కిలో మీటర్ల రోడ్లు, ప్రతి రోజు శతకోటి లీటర్ల తాగునీటి సరఫరా, ఐదు వేల మెగా వాట్ల విద్యుత్ స్తోమత అనేవి  మన హైదరాబాద్ నగరానికి కీలకమైనవి. మళ్ళీ ఇలాంటి రాజధానిని నిర్మించా లంటే ఎంత ఖర్చు,ఎంత కాలం, ఏవిదం గా ఈ  ప్రయాస ని భరించాలి -ఇలాంటి సందేహాలు అభద్రతా భావానికి దారి తీస్తాయి. 

నెలరోజులు లోపునే రాష్ట్ర విభజన విధివిధానాలపై రాష్ట్రపతికి నివేదిక ఇచ్చేందుకు , కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రానికి వస్తుంది.  ఆ కమిటీ రాష్ట్రానికి రాకముందే రాయలాంధ్రులు సమష్టిగా తమ  ప్రతిపాదనలతో సిద్ధం గా ఉండాలి. 

 1.  కొత్త రాజధానిని నెలకొల్పడానికి అవసరమైన భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి డిజైన్లు, అంచనా వ్యయాలు సిద్ధం చేయాలి. ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలి. 
2. భద్రాచలం రెవిన్యూ డివిజన్‌ను (1959లో దీన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు) పరిపాలన సౌకర్యం కోసం తిరిగి తూర్పు గోదావరి జిల్లాలో కలపాలి. సరిగ్గా ఈ రెవిన్యూ డివిజన్‌లోనే కూనవరం వద్ద శబరినది గోదావరిలో కలుస్తుంది. దిగువ గోదావరి నదిలోనికి నీరువచ్చేది ప్రధానంగా శబరి నది ద్వారానే. 
3.  రాజధాని నగరం అంటే ప్రభుత్వ విభాగాలన్ని ఒకేచోట వుండితీరాలా? లేక వాటిని వికేంద్రీకరించి మూడు నాలుగు నగరాల్లో ఏర్పాటు చేయడం సాధ్యమేనా? వంటి అంశాల మీద కూడా  విస్తృతంగా చర్చ జరగాలి.
4. దేశం ఆర్ధికం గా, రక్షణ పరం గా, చాల క్లిష్ట స్థితిలో ఉన్న ఈ సమయం లో, కేంద్రం , వివిధ ప్రాంతాల అభివృద్దికి నిధులు కేటాయించలేని దశలో ఉన్ది. ఒక వేళ  ప్రజల మనోభావాలను బుజ్జగించ దానికి ఆర్ధిక సహకారా నికి ఒప్పుకొన్నా అది జరిగే పని కాదు. కాబట్టి , హైదరాబాద్ ని శాశ్వతం గా రెండు రాష్ట్రాలకు రాజ దాని గా ఉంచాలి. 
5. (autonomous river authority )ప్రతి నదికి  , క్వాసి జుడీషియల్ అధికారాలున్న  స్వయం నియంత్రిత నిర్వహణ కార్య వర్గాన్ని నిపుణులతో ఏర్పాటు చే యాలి.  

పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుని పెట్టక ముందే సీమాంధ్ర కి నదీ జలాల , ఉద్యోగాల ,రాజధాని నిర్మాణ ప్రదేశం మరియు నిధుల కేటాయింపు కి రాజ్యాంగ బద్ధ  హామీ లేదా  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్  - ఇవే సీమాంధ్రుల లక్ష్యాలు కావాలి.

Comments