తెలుగు గడ్డ రెండుగా చీలింది . తెలుగు భాష కి రెండు కేంద్రాలు . తెలుగు జాతి కి రెండు పాలనా ప్రభుత్వాలు.
రాజకీయం నెగ్గింది . సమతా మమతలు తెల్ల బోయాయి. అవగాహనా లోపమో ,ఆవేశ కావేసమో ,కుటిల రాజ కీయమో ,ఏది ఏమైనా,భౌగోళికం గా, సహజ వనరుల పరంగా చీల్చ రాని తెలుగు గడ్డను చిదిమి దీపం పెట్టుకోవాలనే క్రూర మైన ఆశ. ఇది ఏ తిమిరానికి దారి తీస్తుందో? --- ఇది కొందరి ఆక్రోశం .
42శాతం ప్రజలు,45శాతం పచ్చని అడవులు,20శాతం నల్ల బంగారం తో , కోటి రతనాల తెలెంగాణ శత కోటి మురిపాల బంగారు గడ్డ గా ఎదగాలని ,పల్లె ముంగిళ్ళ నిండుగా బోనాల పండుగ విరియాలని, యువత ఆశలు బతుకమ్మ సంబరం కావాలని 5కోట్ల ఆంధ్రులు కోరుకొంటున్నారు . --- ఇది మరి కొందరి ఆశీస్సు.
నిండు గా వెలిగే తెలుగు జాతి రెండై
మెండుగా పారే పాయలు సగమై
దండిగా మురిసే గాదెలు తేలికై
జండిగా ఉన్న గుండెలు భారమై
తెలుగు తల్లి పలుకు తుంది తెలెంగానము ...
సర్వే జనా స్సుఖినో భవన్తు.
Comments
Post a Comment