Skip to main content

వైద్య విద్య ఫీజుల పెంపుపై ఇంకా కొనసాగుతున్న అయోమయం ..

 పెద్ద మొత్తంలో పెంచాలని ప్రైవేటు కళాశాలల పట్టు
5-10 శాతానికి మించి అనుమతించబోమంటున్న సర్కారు. 
2013-14, 15, 16 విద్యా సంవత్సరాలకు కొత్త ఫీజుల కోసం ఏఎఫ్ఆర్‌సీ( 'ఆంధ్రప్రదేశ్ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ) పలుమార్లు కళాశాలల యాజమాన్యాలు, వైద్య విద్యా శాఖాధికారులతో సమీక్షలు జరిపింది.
 ప్రైవేటు కళాశాలల విన్నపం:
ఎంబీబీఎస్ కోర్సు ఏ-కేటగిరీ కింద ఉన్న రూ.60 వేల ఫీజును రూ.లక్షకు, 
బీ-కేటగిరీ కింద ఉన్న రూ.2.40 లక్షలను రూ.3 లక్షలకు, 
సీ-కేటగిరీ కింద ఉన్న రూ. 5.50 లక్షలను రూ.10 లక్షలకు - పెంచాలని కోరుతున్నాయి.

కానీ, సర్కారు మాత్రం 5-10 శాతం మేర పెంపునకే సిద్ధంగా ఉన్నట్లు వైద్య విద్యాధికారులు చెబుతున్నారు. 
ఆగస్టు 1 నుంచి యూజీ కోర్సులు, మే 1 నుంచి పీజీ కోర్సుల తరగతులు ప్రారంభం కావాలి. కానీ ఇప్పటివరకు కాలేదు. త్వరగా ఫీజులను నిర్ణయిస్తే.. కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తారు.

Comments