Skip to main content

సోదర ప్రైవేట్ డాక్టర్స్ కి విన్నపం :(Appeal to all A.P. private doctors)


సోదర ప్రైవేట్ డాక్టర్స్ కి ,
నమస్తే

మన ఐ.ఎం.ఎ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ , ప్రైవేట్ డాక్టర్స్ కి మెరుగైన సేవలందించాలనే ఉదేశ్యంతో  స్టాండింగ్ కమిటీ  మరియు ఏక్షన్ కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నొ విజయాలు సాధించిందని మీ అందరి కీ తెలుసు. మెడికల్ ప్రొటెక్షన్ చట్టమైనా , ప్రైవేట్ హాస్పిటల్ రిజిస్ట్రషన్ చట్ట సవరణలైనా -ఇవన్నీ ఐ.ఎం.ఎ - ఆంధ్ర ప్రదేశ్ తోనే సాధ్యమైనాయి .

కానీ , సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చే చట్టాలను - ఉదాహరణకు - ఇ.ఎస్.ఐ చట్టం , కస్టంస్ , ఇన్ కం టాక్స్ ,సర్వీస్ టాక్స్ , క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్ చట్టం - ఇలాంటి కేంద్ర ప్రభుత్వ  చట్టాలను ధీటుగా ఎదుర్కోవాలంటే   జాతీయ స్థాయిలొ పనిచేసే ఐ.ఎం.ఎ కే చెల్లుతుంది . తేలిక రుణాలు , డిస్పెన్సరీలకు ఫార్మసిస్ట్ లైసెన్స్ నుండివెసులుబాటు , సబ్సిడీ తో కరెంటు ఇలాంటి సౌకర్యాలు పొందాలన్నా నేషనల్ ఫోరం ద్వారానే సాధ్య పడుతుంది .
వీటన్నింటినీ ద్రుష్టిలో పెట్టుకొని,  అన్ని రాష్ట్ర  శాఖలలో ప్రైవేట్ డాక్టర్స్ సంఘ ఉప శాఖలను త్వరితగతిన ఏర్పాటు చేయమని ఐ.ఎం.ఎ కేంద్ర సంఘం  కోరింది .

ఈ సూచన మేరకు , ఐ.ఎం.ఎ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ అందరికీ మరింత మంచిగా ప్రత్యేక సేవలందించాలనే భావంతో   ప్రైవేట్ హాస్పిటల్స్ ని సంఘటితం చేసే ఉద్దేశ్యంతో , హాస్పిటల్ బోర్డ్ ని రూపొందించింది . ఇది వేరే సంఘం కాదు . ఐ.ఎం.ఎ లొ ఒక ఉప శాఖ మాత్రమే .

ప్రైవేట్ హాస్పిటల్స్ , లేబరేటరీలు , క్లినిక్స్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్ ల సమాచారాన్ని సేకరించి ,క్రోడీకరించి డేటా బాంక్ ని ఏర్పరచి మెరుగైన వ్యవస్థ ని నిర్మిద్దామనే ఆశయంతో లోకల్  బ్రాంచి సెక్రటరీలందరికీ అప్ప్లికేషన్ ఫారాలు పంపటమైనది . మీరు వాటిని పూర్తి చేసి మీ బ్రాంచి సెక్రటరీకి ఇవ్వండి .లేదా అప్లికేషన్ ఫారాలు మన ఐ.ఎం.ఎ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకొని వివరాలు నింపి హైదరాబాద్ ఆఫీస్ కి పోస్ట్ చేయండి .

 ఐ.ఎం.ఎ కి సహకరించండి . అస్సోస్సియేషన్ మీ సేవలో ముందు ఉంటుంది . మిమ్ము సదా కాపాడుతుంది .

మీ
డా.శ్రీనివాస రాజు
రాష్ట్ర కర్యదర్శి
ఐ.ఎం.ఎ హాస్పిటల్ బోర్డ్  .

Comments